వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్రమణలపై ఉక్కుపాదం .. రోడ్లుమీదికొచ్చిన వారిపై చర్యలన్న బల్దియా బాస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆక్రమణలతో రాజధాని కుచించుకుపోతోంది. ఇందు గలదు .. అనే సామెత అన అక్రమార్కులకు సరిగ్గా సరిపోతోంది. ప్రభుత్వ భూమి, చెరువు, కుంటలను వదలని అక్రమార్కులు .. రోడ్లను కూడా క్రమంగా అక్రమించుకుంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయిలో పర్యటించి .. తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.

ఆక్రమణలపై ఫోకస్ ..
హైదరాబాద్‌లో ఆక్రమణలో బల్దియా ఫోకస్ చేసింది. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీచేసింది. ఇవాళ జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ హైదరాబాద్‌లో పర్యటించారు. మాదాపూర్, గచ్చిబౌలిలో రోడ్లను పరిశీలించారు. రోడ్లు కూడా ఆక్రమణకు గురైనట్టు తన పరిశీలనలో తేలిందని ఆయన తెలిపారు.

Recommended Video

మురికి కాలువలు శుభ్రం చేసిన పంచాయతీ సిబ్బంది
ghmc commissioner warning to occupiars

అంతేకాదు కొన్నిచోట్ల నాలాలను కూడా ఆక్రమించారని తెలిపారు. దీనికి సంబంధించి సంబంధికులపై నోటీసులు జారీచేస్తామని చెప్పారు. అన్ని ఆక్రమణలు తొలగిస్తామని తేల్చిచెప్పారు. రహదారులపై ఆక్రమణలు తొలగిస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని .. దీనికి తగినట్టు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇరుగ్గా రోడ్లు
వాస్తవానికి నగరంలో రోడ్ల కొన్నిచోట్ల ఇరుక్కగానే ఉన్నాయి. ఆ రోడ్లను ఆక్రమించడంతో మరింత చిన్నిగైపోయాయి. అయితే బల్దియా చర్యలతో .. రోడ్లు విస్తారంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రహదారి పెరిగి .. కాస్త ట్రాఫిక్ సమస్య కూడా తీరే ఛాన్స్ ఉంది. బల్దియా కమిషనర్ హెచ్చరికలను నెటిజన్లు స్వాగతించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకొని .. రోడ్ల విస్తరణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

English summary
ghmc focused on the invasion of Hyderabad. Already warnings have been issued for stringent action against the attackers. Today GHMC Commissioner Dana Kishore toured city. Roads were examined in Madapur and Gachibowli. He added that the road was also under attack. He also said that some nalas have been invaded. Notices will be issued to relatives in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X