వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

GHMC Election Results 2020: బీజేపీ గెలుపులో పవన్ కల్యాణ్ పాత్ర -ఏపీ నేతలు వచ్చుంటే?

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుకుంది. టీఆర్ఎస్, ఎంఐఎంలకు ధీటుగా పోరాడి.. కారు స్పీడుకు బ్రేకులు వేయడంతోపాటు మజ్లిస్ కోటలో సైతం పాగా వేసింది. 2016 ఎన్నికల్లో కేవలం 3 సీట్లకు పరిమితమైన బీజేపీ.. శుక్రవారం వెలువడిన జీహెచ్ఎంసీ 2020 ఎన్నికల ఫలితాల్లో ఏకంగా ఐదు పదుల స్థానాలకు చేరువైంది. బీజేపీ గెలుపు తర్వాత రెండు ప్రధాన కారణాలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది..

GHMC Election Results 2020 Live: నోటాకు భారీగా ఓట్లు -పలు వార్డుల్లో ఫలితం తారుమారుGHMC Election Results 2020 Live: నోటాకు భారీగా ఓట్లు -పలు వార్డుల్లో ఫలితం తారుమారు

దుమ్మురేపిన కాషాయం.

దుమ్మురేపిన కాషాయం.


మొత్తం 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీలో ఇటు టీఆర్ఎస్, అటు ఎంఐఎంలను నిలువరించడంలో బీజేపీ సక్సెస్ అయింది. సాయంత్రం7 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. బీజేపీ ఏకంగా 46 స్థానాలను కైవసం చేసుకోగా, అధికార టీఆర్ఎస్ కేవలం 60 స్థానాలకు పరిమితమైపోయింది. ఎంఐఎం 42 సీట్లలో విజయం సాధించింది. పాతబస్తీలో ఎంఐఎం కంచుకోటలుగా భావించే రెండు డివిజన్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. గతంలో టీఆర్ఎస్ 99 సీట్లు సాధించగా, ఈసారి ఆ పార్టీకి భారీగా గండికొడుతూ బీజేపీ గెయినైంది. అయితే, మరో రకం వ్యూహాన్ని అమలు చేసి ఉంటే విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటంటే..

కరోనా విలయం: మోదీ సంచలనం -వచ్చే వారాల్లోనే వ్యాక్సిన్‌ పంపిణీ -ఉచితం కాదు -ధర ఎంతంటేకరోనా విలయం: మోదీ సంచలనం -వచ్చే వారాల్లోనే వ్యాక్సిన్‌ పంపిణీ -ఉచితం కాదు -ధర ఎంతంటే

గ్రేటర్‌లో పవన్ ఫ్యాక్టర్

గ్రేటర్‌లో పవన్ ఫ్యాక్టర్

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి మిత్రుడైన జనసేనాని పవన్ కల్యాణ్.. తెలంగాణలో మాత్రం కాషాయదళానికి వ్యతిరేకంగా పోటీకి సిద్ధం కావడం, కేంద్ర పెద్దల జోక్యంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, చివరికి కమలానికే ఓటేయాలని జనసైనికులను అభ్యర్థించడం తెలిసిందే. గ్రేటర్ లో పవన్ తో పొత్తు విషయమై స్థానిక బీజేపే నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వాటికి నొచ్చుకున్న జనసేన క్షమాపణలు కూడా కోరడం విదితమే. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 11రోజులు అన్నం మానేశానన్న పవన్ కల్యాణ్ ను పక్కన పెట్టుకుంటే నష్టం జరగొచ్చని బీజేపీ నేతలు భావించి ఉండొచ్చు. అయితే, గ్రేటర్ లో మెజార్టీ ఓటర్లయిన ఆంధ్రా ఆరిజిన్స్ లో పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటం, వారంతా తమ నేత ఆదేశించినట్లుగానే కమలానికి ఓట్లేయడం వల్లే బీజేపీకి సీట్లు పెరిగాయనే వాదన కూడా వినిపిస్తోంది. అలాగే..

కనిపించని ఏపీ బీజేపీ నేతలు..

కనిపించని ఏపీ బీజేపీ నేతలు..

గ్రేటర్ హైదరాబాద్ లోని మెజార్టీ డివిజన్లలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లలో చాలా మందికి హైదరాబాద్ లోనే ఓటుంది. అయినా సరే బీజేపీ.. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నేతలతో ప్రచారం చేయించిందేకానీ ఏపీ బీజేపీ నేతలను హైదరాబాద్ లోకి అడుగు పెట్టనీయలేదు. రాష్ట్ర విభజన, ఏపీకి ప్రత్యేక హోదా అంశాల్లో కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా దోషే అని ఏపీలో పొలిటికల్ నెరేటివ్ బలంగా ఉండటంతో గ్రేటర్ లోని ఆంధ్రా ప్రాంతీయులు ఆ ప్రభావానికి గురికాకుండా ఉండేలా బీజేపీ జాగ్రత్త పడింది. అదీకాక, గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం కేసీఆర్ కు కలిసొచ్చిన నేపథ్యంలోనూ బీజేపీ తన ఏపీ నేతల ఊసు లేకుండానే పనికానిచ్చింది. అయితే, మారిన రాజకీయ పరిస్థుల నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు కూడా ప్రచారాని వచ్చుంటే బీజేపీకి ఇంకొన్ని సీట్లు పెరిగేవని కొందరు అంటుండగా, అలా జరిగి ఉంటే సెంటిమెంట్ టీఆర్ఎస్ కు ఫేవర్ అయిఉండేదని ఇంకొందరు చెబుతున్నారు. ఏదేమైనా తెలంగాణ బీజేపీ ఒకప్పటిలా ఏపీ నేతల సహకారం లేకుండా సొంతగా గెయిన్ కావడం గమనార్హం.

Recommended Video

GHMC Results : Uttam Kumar Reddy Resigns As chief Of Telangana Congress

English summary
Hyderabad GHMC Election Results 2020 Live Updates in Telugu, how pawan kalyan's jana sena helped bjp gain in hyderabad. even though national level leaders came to hyderabad, andhra pradesh bjp leaders did not participate in ghmc elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X