వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేటర్ ఎన్నిక, 2వేల నామినేషన్లు: రంగంలో వారసులు, బరిలో 21 ఏళ్ల కుర్రాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల కోసం నామినేషన్ల ఘట్టం ఆదివారం ముగిసింది. గ్రేటర్ పరిధిలోని ఒక్కో డివిజన్‌కు పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 150 డివిజన్లకు రెండువేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.

గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు తెరాస 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, ఇంకా ఏడు డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ 94 డివిజన్లలో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టిడిపి - బిజెపి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం టిడిపి 87 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉండగా, 82 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

బీజేపీ 63 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. దీంతో బీజేపీ ఒక్కో డివిజన్ లో ముగ్గురు లేక నలుగురు చొప్పున అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది. మజ్లిస్ పార్టీ 75 స్థానాల్లో అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది.

కాంగ్రెస్ పార్టీ కొందరికి ఫోన్ల ద్వారా సమాచారం అందించి నామినేషన్లు దాఖలు చేయించారు. దాదాపు ప్రతి స్థానంలోనూ స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

GHMC elections: Nominations completed

జిహెచ్ఎంసి పదనిసలు

గ్రేటర్ ఎన్నికల్లో చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వారు ఇప్పుడు కార్పోరేట్ బరిలో నిలుస్తున్నారు. కొందరు నేరుగా రంగంలోకి దిగుతుండగా, మరికొందరు సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులను బరిలోకి దింపుతున్నారు.

- మాజీ కేంద్రమంత్రి, దివంగత ఆలె నరేంద్ర సతీమణి ఆలె లలిత గౌలిపుర డివిజన్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

- టిడిపి మాజీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గతంలో సైదాబాద్ నుంచి కార్పోరేటర్‌గా పని చేశారు. ఇప్పుడు అది మహిళ జనరల్ కావడంతో.. సతీమణి స్వర్ణలతా రెడ్డిని తెరాస నుంచి బరిలోకి దింపారు.

- కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ కాలేరు శ్రీనివాస్.. గోల్నాక మహిళా జనరల్ కావడంతో తన భార్య పద్మను పోటీ చేయిస్తున్నారు. ఇతను తెరాసలో చేరారు. దీంతో పద్మ ఆ పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు.

- బిజెపి మాజీ ఫ్లోర్ లీడర్ ప్రకాశ్ ఇటీవల తెరాసలో చేరారు. ఆయన గుడిమల్కాపూర్ టిక్కెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా పని చేసిన దిడ్డి రాంబాబుకు ఇప్పటి వరకు ఏ పార్టీ నుంచి టిక్కెట్ రాలేదు.

- ఉప్పల్ నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తెరాస ఇంఛార్జ్ బి సుభాష్ రెడ్డి.. తాజాగా తన సతీమణి స్వర్ణను హబ్సిగూడ నుంచి కార్పోరేటర్ అభ్యర్థిగా బరిలోకి దించారు.

- ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నియోజకవర్గ తెరాస ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి సతీమణి కవిత.. వెంకటేశ్వర కాలనీ నుంచి బరిలో నిలిచారు.

- దివంగత పిజెఆర్ కూతురు విజయా రెడ్డి 2014 ఎన్నికల్లో వైసిపి తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమె తెరాస నుంచి ఖైరతాబాద్ కార్పోరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

- జూబ్లీహిల్స్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన మురళీ గౌడ్ నయుడు సంజయ్ గౌడ్.. యూసుఫ్ గూడ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు.

- అంబర్ పేట నుంచి 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన అహ్మద్ ప్రస్తుతం మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా అంబర్ పేట డివిజన్ నుంచి బరిలో నిలుస్తున్నారు.

- మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి తార్నాక డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.

- మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ మెహదీపట్నం నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

- రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు కూతురు విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

- మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ జాంబాగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ముప్పై ఏళ్ల క్రితం 1986లో తొలిసారిగా ముఖేష్ గౌడ్‌ జాంబాగ్‌ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పుడు జాంబాగ్‌ నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించేందుకు ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్ గౌడ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో నిలిచారు.

- హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి రాంనగర్ డివిజన్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

- ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి షహద్ బిన్ సమద్ అబ్దాద్ గ్రేటర్ బరిలో నిలిచారు. 21 ఏళ్ల ఈ విద్యార్థి ఉప్పుగూడ మాజీ కార్పోరేటర్ నమద్ బిన్ అబ్దాద్ తనయుడు. షహద్ దక్కన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ సివిల్ ఫైనలియర్ చదువుతున్నాడు. గత ఎన్నికల్లో ఆయన తండ్రి సమద్ బిన్ ఉప్పగూడ కార్పోరేటర్‌గా పని చేశారు. ఇప్పుడు ఆయన కొడుకు షహద్ బరిలో నిలుస్తున్నాడు.

- తెరాసలో సీమాంధ్రులకు టిక్కెట్లు ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో పదిమంది సీమాంధ్రులను తెరాస బరిలో దింపుతున్నట్లుగా కనిపిస్తోంది. సోమాజిగూడ నుంచి విజయలక్ష్మి, అమీర్ పేట నుంచి శేషు కుమారి, వెంగళరావు నగర్ నుంచి కిలారి మనోహర్, కెపిహెచ్‌‍హి నుంచి అడుసుమిల్లి వెంకటేశ్వర రావు పోటీ చేస్తున్నారు.

English summary
GHMC elections: Nominations completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X