వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందేళ్లలో జరగని ఆక్రమణలు కేసీఆర్ వచ్చిన ఆరేళ్లలో.. గులాబీ బాబులకు బుద్ధి చెప్పండన్న రేవంత్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కెసిఆర్ ను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్రం సాధించి, ప్రగతి పథంలో నడిపిస్తున్న తమకే ఓట్లు అడిగే హక్కు ఉందని ప్రచారం చేసుకుంటున్న వేళ, రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ ఇస్తున్నారు. ఈరోజు మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి వందలాది మంది ఆత్మబలిదానాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ చేసిందేమీ లేదంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Recommended Video

GHMC Elections: కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ ను కుట్రపూరితంగా డిస్ క్వాలిఫై చేసే ప్రయత్నం

గ్రేటర్ లో ప్రలోభాల పర్వం .. గంపగుత్తగా ఓట్ల కోసం.. రహస్య సమావేశాలు, తాయిలాలు గ్రేటర్ లో ప్రలోభాల పర్వం .. గంపగుత్తగా ఓట్ల కోసం.. రహస్య సమావేశాలు, తాయిలాలు

 నిజాం కాలంలోనే అభివృద్ధి ... తెలంగాణా ఏర్పడిన తర్వాత విధ్వంసపాలన

నిజాం కాలంలోనే అభివృద్ధి ... తెలంగాణా ఏర్పడిన తర్వాత విధ్వంసపాలన

కొన్ని వందల ఏళ్ళ క్రితమే నిజాం పాలకులు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఏర్పడిన తర్వాత విధ్వంస పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.

మాయమాటలతో కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని, 67 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పడం పచ్చి అబద్ధమని రేవంత్ ఫైర్ అయ్యారు . హైదరాబాద్ నగరానికి ఖర్చుపెట్టింది ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే అని పేర్కొన్న రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను కూడా తమ ఖర్చులతో కలిపి చూపుతున్నారంటూ పేర్కొన్నారు.

చెరువులు , నాలాల కబ్జాలు టీఆర్ఎస్ హయాంలోనే

చెరువులు , నాలాల కబ్జాలు టీఆర్ఎస్ హయాంలోనే

వరద బీభత్సం ప్రకృతి వైపరీత్యం కాదని, పాలకుల వైఫల్యం అని రేవంత్ నిప్పులు చెరిగారు.

హైదరాబాదుకు అది చేస్తున్నాం ... ఇది చేస్తున్నామని కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ప్రజల కోసం చేసిందేమీ లేదని తేల్చి చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు, పార్కులను కబ్జాలు చేశారని, మంత్రి కేటీఆర్ అనుచరులు వందల చెరువులను ఆక్రమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు .

 ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాలు ఉన్న పుస్తకం టిఆర్ఎస్ ప్రగతి నివేదిక

ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాలు ఉన్న పుస్తకం టిఆర్ఎస్ ప్రగతి నివేదిక

ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాలు ఉన్న పుస్తకం టిఆర్ఎస్ ప్రగతి నివేదిక అని అబద్దాలను ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో గెలవాలని టిఆర్ఎస్ పార్టీ విఫలయత్నం చేస్తోందని విమర్శించారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రగతి నివేదికలో ఒక్క నిజం ఉన్నా 500 రూపాయలు రిటర్న్ అంటూ సెటైర్ వేశారు . ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ మెట్రోకు 3500 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని. నష్టం జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతామన్న టిఆర్ఎస్ పార్టీ హామీ ఏమైంది అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

కరోనా సమయంలోనూ సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చిన నిధులు స్వాహా

కరోనా సమయంలోనూ సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చిన నిధులు స్వాహా


కరోనా సమయంలోనూ సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చిన నిధులను కాజేశారని మండిపడ్డారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత నాలాల కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి వందేళ్లలో జరిగిన ఆక్రమణలు కెసిఆర్ వచ్చిన ఆరేళ్లల్లో జరిగాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
అంతకు ముందు ఫేస్ బుక్ వేదికగా నగరం ప్రశ్నిస్తోంది. తమ సమస్యలు పరిష్కరించని నేతలను నిలదీస్తోంది అంటూ పోస్ట్ చేశారు రేవంత్ రెడ్డి .

గులాబీ బాబులను ఇప్పుడు వదిలేస్తే మళ్లీ ఐదేళ్ల వరకు దొరకరు

గులాబీ బాబులను ఇప్పుడు వదిలేస్తే మళ్లీ ఐదేళ్ల వరకు దొరకరు


గ్రేటర్ లో నిత్యం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ అభ్యర్థులకు ఎదురవుతోన్న చేదు అనుభవాలే నగరం ప్రశ్నిస్తోంది అనటానికి నిదర్శనం అని పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి నిన్న మేయర్, నేడు మైనంపల్లిని నడిబజారులో జనం నిలవేశారని వ్యాఖ్యానించారు . ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి. సమస్యలపై ప్రశ్నించాలి. పరిష్కారం కోసం పోరాడాలి. గులాబీ బాబులను ఇప్పుడు వదిలేస్తే మళ్లీ ఐదేళ్ల వరకు దొరకరు అంటూ పేర్కొన్నారు. అందుకే... మీ సమస్యలపై పోరాడే నాయకులకు మద్ధతివ్వండి. మీ కోసం ప్రశ్నించే గొంతులను గెలిపించండి అని రేవంత్ పోస్ట్ చేశారు.

English summary
Congress Party Working President Revanth Reddy targeted KCR . Revanth Reddy criticised that too much of ponds, canals encroachments in trs regime . Destructive rule would continue after the arrival of Telangana state. Party that did not happen in hundred of years took place in the six years that KCR came.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X