వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాదీలకు హెచ్చరిక: అలా చేస్తే.. ఇక క్రిమినల్ కేసులే!

ఇకనుంచి రోడ్లపై తవ్వకాలకు అనుమతులిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే 10ప్రాంతాల్లో తవ్విన రోడ్లను జూన్10లోగా పునరుద్దరించాలని జలమండలి ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వాసులకు, కాంట్రాక్టు పనులు చేపట్టే సంస్థలకు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఇక నుంచి ఉద్దేశపూర్వకంగానో, లేక పొరపాటునో రోడ్లపై గుంతలు తవ్వితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ghmc janardhan reddy commissioner on road cuttings

జూన్ 1వ తేదీ నుంచి ఈ కఠిన చర్యలు అమలవుతాయని చెప్పారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో జనార్థన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించారు. ఇకనుంచి రోడ్లపై తవ్వకాలకు అనుమతులిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే 10ప్రాంతాల్లో తవ్విన రోడ్లను జూన్10లోగా పునరుద్దరించాలని జలమండలి ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు.

మొత్తం మీద జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతో కాంట్రాక్టు సంస్థలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇకనుంచి గుంతలు తవ్వితే క్రిమినల్ కేసులు తప్పవు కాబట్టి.. సామాన్య జనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే.

English summary
Greater Hyderabad Municipal Commissioner Janardhan Reddy clearly says that if anybody damages the roads they face criminal cases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X