వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిర్యానీ అంటేనే భయపడేలా.. కుళ్లిన మాంసంతో కానిచ్చేస్తున్నారు!..

మంగళవారం నాడు జీహెచ్ఎంసీ అధికారులు జరిపిన దాడుల్లో శ్రీనిధి బావర్చిలో కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారుచేస్తున్నట్లు వెల్లడైంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని పలు హోటళ్లు కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారుచేస్తుండటం బిర్యానీ ప్రియులను కలవరపెడుతోంది. మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ అధికారుల తనిఖీల్లో మల్కాజ్ గిరి పరిధిలోని ఓ హెటల్లో ఈ తతంగం వెలుగుచూడగా.. తాజాగా హబ్సిగూడలోని శ్రీనిధి బావర్చిలోను అలాంటి ఘటనే వెలుగుచూసింది.

మంగళవారం నాడు జీహెచ్ఎంసీ అధికారులు జరిపిన దాడుల్లో శ్రీనిధి బావర్చిలో కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారుచేస్తున్నట్లు వెల్లడైంది. హబ్సిగూడలోని వీధి నెంబర్‌ 8లో ఈ హోటల్ ను నిర్వహిస్తున్నారు. కాగా, ఈ హోటల్ కు లైసెన్స్ కూడా లేదని అధికారులు గుర్తించారు.

<strong>జాగ్రత్త.. కుళ్లిన మాంసంతో బిర్యానీ!, మల్కాజ్‌గిరిలో హోటల్ సీజ్</strong>జాగ్రత్త.. కుళ్లిన మాంసంతో బిర్యానీ!, మల్కాజ్‌గిరిలో హోటల్ సీజ్

Ghmc officials raid on a biryani hotel in habsiguda

గత కొద్దిరోజులుగా నగరంలోని పలు హోటల్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు అపరిశుభ్రంగా ఉన్న హోటల్స్ ను, నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న హోటల్స్ ను సీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

మంగళవారం నాడు జీహెచ్ఎంసీ అధికారులు జరిపిన దాడుల్లో శ్రీనిధి బావర్చిలో కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారుచేస్తున్నట్లు వెల్లడైంది

కాగా, నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అపరిశుభ్రంగా ఉండే హోటల్స్ పై వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు. తాజాగా శ్రీనిధి బావర్చిపై నిర్వహించిన దాడుల్లో మున్సిపల్‌ డీసీ విజయకృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ దుర్గాప్రసాద్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ సుదర్శన్, జవాన్ మారయ్య ట్యాక్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

English summary
On Wednesday GHMC Officials done a raid on Srinidhi biryani hotel. They shocked by seeing biryani making in hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X