వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ల ప్లాన్: బాలకృష్ణ ఇంటిని తొలగించక తప్పదా?

ప్రముఖ సినీనటుడు, తెలుగుదేశం హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన నగరంలోని ఇంటికి కొత్త చిక్కులు వచ్చిపడినట్లు తెలుస్తోంది. ఏకంగా ఆయన ఇంటినే తొలగించే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, తెలుగుదేశం హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన నగరంలోని ఇంటికి కొత్త చిక్కులు వచ్చిపడినట్లు తెలుస్తోంది. ఏకంగా ఆయన ఇంటినే తొలగించే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.

ట్రాఫిక్ నియంత్రణ కోసం..

ట్రాఫిక్ నియంత్రణ కోసం..

వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ లను నివారించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త ప్రణాళికలను రూపొందిందించింది. ఇందులో భాగంగా, వివిధ ప్రాంతాల్లో 20 మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలను తయారు చేసింది.

బాలకృష్ణ ఇంటిని కూల్చక తప్పదా?

బాలకృష్ణ ఇంటిని కూల్చక తప్పదా?

వీటిలో జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు మీదుగా రెండు ఫ్లై ఓవర్లు వెళ్లనుండగా, అందులో ఒకదాని అప్రోచ్ ఫ్లయ్ ఓవర్ డిజైన్ సరిగ్గా బాలకృష్ణ ఇల్లు ఉన్న ప్రాంతం నుంచి వెళ్లనుంది. ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి, వాటి నిర్మాణం చేపడితే.. దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ కట్టించుకుని, ఆపై బాలకృష్ణకు ఇచ్చిన ఇంటిని కూల్చివేయక తప్పని పరిస్థితి ఏర్పడనున్నట్లు సమాచారం.

2631కోట్ల అంచనా

2631కోట్ల అంచనా

కాగా, తొలిదశలో చేపట్టే వంతెనల నిర్మాణానికి రూ. 2,631 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది జీహెచ్ఎంసీ. 2019 చివరికి ఎస్ఆర్డీపీని పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ టార్గెట్ గా పెట్టుకుంది.

ప్రముఖుల నివాసాలు, రెస్టారెంట్లు కూల్చివేత తప్పదు!

ప్రముఖుల నివాసాలు, రెస్టారెంట్లు కూల్చివేత తప్పదు!

ఫైఓవర్ల పనులు ప్రారంభమైతే, మొత్తం 581 నిర్మాణాలను కూల్చివేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో పలువురు ప్రముఖులు ఉంటున్న నివాసాలు, పలు జంక్షన్లలో ఎంతో కాలంగా ఉంటున్న రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

English summary
It is said that ghmc plans for flyovers may disaster for Tollywood actor and MLA Balakrishna's house in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X