హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'గ్రేటర్' లెక్కింపు, 5గం. దాకా ఉత్కంఠ: భారీగా బెట్టింగులు! వారసులు వీరే...

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు రోజుల క్రితం (ఫిబ్రవరి 2వ తేదీన) గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది. అయితే, ఫలితాలు సాయంత్రం 5 గంటల తర్వాతనే వెల్లడి కానున్నాయి. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

గ్రేటర్ పరిధిలో రీపోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 3 గంటలకు లెక్కింపు ప్రారంభమైనప్పటికీ.. ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడి చేయడం లేదు. సాయంత్రం 5 గంటలకు రీపోలింగ్ పూర్తవుతుంది. ఆ వెంటనే ఫలితాల వెల్లడి ప్రారంభమవుతుంది.

150 డివిజన్లలో 1333 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో నేడు తేలుతుంది. 24 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కొన్ని చోట్ల ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 3వేల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. తొలుత వాటిని లెక్కిస్తున్నారు.

GHMC polls a litmus test for all parties, counting of votes at 3 PM

కౌంటింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. తొలుత 26 వార్డుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు తొలి ఫలితం వెల్లడి కానుంది. దత్తాత్రేయ నగర్ డివిజన్ ఫలితం తొలుత వచ్చే అవకాశముంది. కాగా బరిలో ఎమ్మెల్యేలుగా గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వారు కూడా ఉన్నారు.

వాస్తవానికి ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయమే ప్రారంభం కావాల్సి ఉండగా పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలయింది. ఫలితాలపై బెట్టింగులు కూడా కొనసాగుతున్నాయి. ఆర్కేపురం, జాంబాగ్ ఫలితాలపై బెట్టింగులు కడుతున్నట్లుగా తెలుస్తోంది.

అదృశ్యం పరీక్షించుకుంటున్న నేతల వారసులు వీరే..

బంగారు లక్ష్మణ్ మనమరాలు స్రవంతి
కె కేశవ రావు కూతురు విజయలక్ష్మి
పిజెఆర్ కూతురు విజయా రెడ్డి
నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి
ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్
ఎమ్మెల్యే కనకా రెడ్డి కోడలు శాంతి రెడ్డి
ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి కోడలు అనితా రెడ్డి
ఆలె నరేంద్ర భార్య లలిత
టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ బొంతు రామ్మోహన్.

English summary
GHMC polls a litmus test for all parties, counting of votes at 3 PM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X