వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఒరిజినల్' టిఆర్ఎస్ నేతలకు షాక్: గెలిచాం లెక్క తేలాలి.. కెటిఆర్ ఉద్వేగం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటున్నాయి. ఈ చేరికలు పార్టీలోనే చాలాకాలం నుంచి ఉన్న వారికి మింగుడు పడటం లేదని అంటున్నారు. కొత్త వారి రాకతో పాతవారు అవకాశాలు రావని అసంతృప్తికి గురవుతున్నారంటున్నారు.

తెరాసలోకి పెద్ద ఎత్తున వలసలను నిరసిస్తూ అంబర్ పేట తెరాస నేత రమణ సోమవారం నాడు సెల్ టవర్ ఎక్కారు. దీంతో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందని అంటున్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి.

సోమవారం మాజీ మంత్రి సి కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ తెరాసలో చేరారు. ఇలాంటి ముఖ్యుల చేరికతో... తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని, తాము వారిని అనుసరించాల్సి ఉంటుందని ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అసాధారణ విజయం దిశగా దూసుకెళ్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి గల్లీ ప్రజలే బాస్‌లని, ఢిల్లీలో ఉన్న నాయకులు కాదని స్పష్టం చేశారు.

తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

సోమవారం తెలంగాణభవన్‌లో మాజీ మంత్రులు సి కృష్ణ యాదవ్, పడాల భూమన్న, కాంగ్రెస్ జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు , లకా్ష్మరెడ్డి , బీజేపీ నాయకులు కిరణ్ కుమార్, నందకిశోర్, కమ్మ సంఘం నాయకులు సాయిబాబా, పలువురు టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కేటీఆర్ గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

 తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయానికి తాళం వేశారు. బీజేపీ కార్యాలయంలో కుర్చీలు లేస్తున్నాయి. టీడీపీ కార్యాలయంలో అర్థనగ్న ప్రదర్శనలు చేపడుతున్నారు. తెలంగాణభవన్‌లో మాత్రం ప్రతిరోజు విజయోత్సవ వాతావరణం ఉందన్నారు.

తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

19 నెలల కాలంలో కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు గులాబీ బాట పడుతున్నారని, పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్న తీరుతో గ్రేటర్‌లో గులాబీ పార్టీ అసాధారణ విజయం సాధించడం ఖాయమని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు.

 తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సెంచరీ (వంద సీట్లు) దాటుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, టీడీపీ నేతలు టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైందని అంగీకరిస్తూనే వంద సీట్లు గెలుస్తుందా..? అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. మీరందరూ తోడైతే వారి కోరికను నిజం అవుతుందని, అందరం కలిసికట్టుగా పని చేసి 150 సీట్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో 100 సీట్లకు పైగా గులాబీ జెండాను ఎగురవేద్దామన్నారు.

 తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

కేసీఆర్‌లాంటి వారు యుగానికి ఒకరు పుడతారు. అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించిన ఘనత ఆయనదే. పట్టుపట్టితే వదిలే వ్యక్తి కాదు కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పినట్లు హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసి తీరుతారని, అది సాధించడానికి కేసీఆర్‌దగ్గర ఇప్పటికే పకడ్బందీ ప్రణాళిక ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని, ఇంకొకరితో సాధ్యం కాదన్నారు.

కెటిఆర్

కెటిఆర్

హైదరాబాదీలను వివక్షకు తావు లేకుండా అందరినీ అన్నదమ్ముల్లా చూసుకుంటున్నామని కెటిఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ సోమవారం మల్కాజిగిరి, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించారు. మూడోరోజు రోడ్‌షో మల్కాజిగిరి సర్కిల్ నుంచి ప్రారంభమయ్యింది.

కెటిఆర్

కెటిఆర్

కార్యకర్తలు, అభిమానుల జయజయధ్వానాల మధ్య రోడ్‌షో సాగింది. రోడ్‌షో ముగింపు సందర్భంగా ఉప్పల్‌లో కేటీఆర్ మాట్లాడుతూ... డివిజన్ అభివృద్ధికి ఉప్పల్‌ను దత్తత తీసుకుంటానన్నారు. రోడ్‌షోకు వచ్చిన జనాన్ని చూసిన కేటీఆర్ కాస్త ఉద్విగ్నతకులోనయ్యారు. ఈ ప్రజాదరణ చూస్తే గ్రేటర్ ఎన్నికలు అయిపోయాయన్నారు.

కెటిఆర్

కెటిఆర్


టీఆర్‌ఎస్ గెలిచిందన్నట్లుగా అనిపిస్తోందని, తేలాల్సింది సీట్ల లెక్కేనని, ఈ యాత్ర విజయయాత్రను తలపిస్తున్నదని, మేయర్ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడుతున్నట్లుగా ఉందని కెటిఆర్ అన్నారు. గ్రేటర్‌లో ఎక్కడికెళ్లినా జనం గుండెలకు హత్తుకుంటున్నారని, ఈ ప్రజాదరణ మరువలేనిదన్నారు.

 కెటిఆర్

కెటిఆర్

రెండేళ్ల క్రితం ప్రాంతాలుగా విడిపోదాం.. ప్రజలుగా కలిసుందామని చెప్పామని, ఆమాటకనుగుణంగా నేడు అందరినీ బ్రహ్మాండంగా అన్నదమ్ముల మాదిరిగానే చూసుకుంటున్నమని కెటిఆఱ్ చెప్పారు. హైదరాబాద్‌లో 30 ఏళ్ల తర్వాత కోతల్లేని ఎండాకాలాన్ని పరిచయం చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా ఒక్కసారి ఆలోచించాలని కేటీఆర్ కోరారు.

కెటిఆర్

కెటిఆర్


తెలంగాణ ఏర్పడితే పెట్టుబడులు రావని, ఇబ్బందులొస్తాయని అన్నారని, కానీ ఇవాళ పెట్టుబడులు వరదలా పారుతున్నయని కెటిఆర్ తెలిపారు. వెయ్యికిపైగా కంపెనీలు, 70 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు, 25 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.

 కెటిఆర్

కెటిఆర్

గూగుల్, అమెజాన్, ఊబర్ కంపెనీలు తమ అంతర్జాతీయ కార్యాలయాలు పెట్టేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయంటే.. అది తెలంగాణ ప్రభుత్వ సమర్థత చూసేనని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని రూ.1000కి, వికలాంగులకైతే రూ. 1500కు పెంచిందని వివరించారు.

English summary
The deluge of leaders and cadre from the TD, the Congress, the BJP and other parties is leaving the ruling TRS quite unwieldy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X