• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జీహెచ్ఎంసీ పరిధిలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లు, హౌజ్ క్లస్టర్లు ఇవే, పటిష్ట చర్యలు

|

హైదరాబాద్: రాష్ట్రంలో సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా బారినపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) చర్యలకు సిద్ధమైంది.

జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లు

జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లు

జీహెచ్ఎంసీని 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. ఈ మినీ కంటైన్మెంట్ జోన్ల పరిధిలో పటిష్ట చర్యలు చేపట్టనుంది. 5 కేసుల కంటే ఎక్కువ ఉంటే మినీ కంటైన్మెంట్ జోన్‌ను ఏర్పాటు చేయనుంది. ఒకే అపార్ట్‌మెంట్‌లో పాజిటివ్ కేసులు వస్తే హౌజ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తారు. క్లస్టర్ పరిధిలో బారికేడ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేవలం శానిటేషన్, మున్సిపల్ సిబ్బంది, వైద్యారోగ్య శాఖ సిబ్బందిని మాత్రమే అనుమతించనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.

హై రిస్క్ ప్రాంతాల్లో శానిటైజ్ చేస్తున్న డీఆర్ఎఫ్ బృందాలు

హై రిస్క్ ప్రాంతాల్లో శానిటైజ్ చేస్తున్న డీఆర్ఎఫ్ బృందాలు

ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు శానిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. జంట నగరాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు సోడియం హైపోక్లోరైట్ స్ప్రేయింగో చేస్తున్నారు. హై రిస్క్ ప్రాంతాల్లో ఇంటెన్సివ్ శానిటేషన్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేస్తున్నారు. 19 డిజాస్టర్ డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో గురువారం కూకట్‌పల్లి, నిజాంపేట్, కేపీహెచ్‌బీ, మియాపూర్ రోడ్లు, ఇతర కాలనీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌తో శానిటైజ్ చేశారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రజలకు సూచిస్తున్నారు.

(జీహెచ్ఎంసీ కంటైన్మెంట్ జోన్లు ఇవే)

తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

కాగా, తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 20) రాత్రి 8గం. నుంచి బుధవారం(ఏప్రిల్ 21) రాత్రి 8గం. వరకు 5567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 23 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం(ఏప్రిల్ 22) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,788కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1899కి చేరింది. ప్రస్తుతం 49,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,21,788కి చేరింది.ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.50శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 84.5శాతం ఉండగా తెలంగాణలో 86.16 శాతం ఉంది. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 989 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,21,75,425 కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా కట్టడికి ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను ఏప్రిల్ 30 వరకు విధించిన విషయం తెలిసిందే.

English summary
ghmc set up 63 mini containment zones in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X