హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్, అక్కడికక్కడే మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలు దుర్మరణం పాలైంది. ఈ విషాదకర సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రెడ్డి, స్థానికులు, పారిశుద్ధ్య సిబ్బంది కథనం ప్రకారం గోల్నాక వెంకటేశ్వరనగర్‌ వడ్డెర బస్తీకి చెందిన కూలీ రాజు భార్య పల్లపు కొమరమ్మ (29)కి పాప, బాబు ఉన్నారు.

ఆమె గత మూడు నెలలుగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో స్వీపర్‌గా పనిచేస్తుంది. విధుల్లో భాగంగా సోమవారం ఉదయం 7.45 గంటలకు అంబర్‌పేట-ఉప్పల్‌ రహదారిపై బాపూనగర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాల సమీపంలో డివైడర్ల వద్ద రహదారిని శుభ్రం చేస్తుంది.

ఈ క్రమంలో ఉప్పల్‌ వైపు నుంచి అంబర్‌పేట వైపునకు వేగంగా వస్తున్న ఫలక్‌నుమా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ28జెడ్‌3291) ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్లపు కొమరమ్మ తల ఛిద్రమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య సిబ్బందితో పాటు వడ్డెరబస్తీ వాసులు 202 జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.

దీంతో ఉప్పల్-అంబర్ పేట శ్రీరమణ చౌరస్తా వైపునకు ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌ రవికిరణ్‌, సెంట్రల్‌ జోనల్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, సర్కిల్‌-9బి డిప్యూటీ కమిషనర్‌ శైలజ, కార్పొరేటర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

నిర్లక్ష్యంగా, అతివేగంగా బస్సును నడిపి పారిశుద్ధ్య కార్మికురాలి మృతికి కారకుడైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కబీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లపు కొమరమ్మ భర్త రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు జీహెచ్ఎంసీ రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

ఆర్టీసీ బస్సు ఢీకొని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలు దుర్మరణం పాలైంది. ఈ విషాదకర సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది.

బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రెడ్డి, స్థానికులు, పారిశుద్ధ్య సిబ్బంది కథనం ప్రకారం గోల్నాక వెంకటేశ్వరనగర్‌ వడ్డెర బస్తీకి చెందిన కూలీ రాజు భార్య పల్లపు కొమరమ్మ (29)కి పాప, బాబు ఉన్నారు.

 బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

ఆమె గత మూడు నెలలుగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో స్వీపర్‌గా పనిచేస్తుంది. విధుల్లో భాగంగా సోమవారం ఉదయం 7.45 గంటలకు అంబర్‌పేట-ఉప్పల్‌ రహదారిపై బాపూనగర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాల సమీపంలో డివైడర్ల వద్ద రహదారిని శుభ్రం చేస్తుంది.

 బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

ఈ క్రమంలో ఉప్పల్‌ వైపు నుంచి అంబర్‌పేట వైపునకు వేగంగా వస్తున్న ఫలక్‌నుమా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ28జెడ్‌3291) ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్లపు కొమరమ్మ తల ఛిద్రమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

 బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య సిబ్బందితో పాటు వడ్డెరబస్తీ వాసులు 202 జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.

 బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

దీంతో ఉప్పల్-అంబర్ పేట శ్రీరమణ చౌరస్తా వైపునకు ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌ రవికిరణ్‌, సెంట్రల్‌ జోనల్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, సర్కిల్‌-9బి డిప్యూటీ కమిషనర్‌ శైలజ, కార్పొరేటర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

బస్సు చక్రాల కింద నలిగిపోయిన జీహెచ్ఎంసీ వర్కర్

నిర్లక్ష్యంగా, అతివేగంగా బస్సును నడిపి పారిశుద్ధ్య కార్మికురాలి మృతికి కారకుడైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కబీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లపు కొమరమ్మ భర్త రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు.

English summary
GHMC safai Worker died on the spot when a RTC bus hits at Ramanthapoor. several hours traffic closed due to GHMC employees dharna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X