వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదనీరు ఆగొద్దు.. ట్రాఫిక్ నిలవొద్దు..!ముందు జాగ్రత్త చర్యల్లో జీహెచ్ఎంసీ అదికారులు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర పాలక సంస్థ పలు ముందస్తు జాగ్రత్తల కార్యక్రమాలు తీసుకోబోతోంది. వర్షాకాలం నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులకు పరిష్కారం, ముంపు, ముప్పు నివారణ దిశగా స్టాండింగ్‌ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. వరద నీరు భారీగా చేరుతోన్న ప్రధాన రహదారులపై బాక్స్‌ డ్రెయిన్‌లు, కల్వర్టులు నిర్మించే ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన గురువారం స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కమిషనర్‌ ఎం. దానకిషోర్‌, కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో ఎజెండాతోపాటు అనుబంధ ఎజెండాలోని అంశాలపై చర్చించారు.

అది బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్..! అది బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్..!

నగరంలో ముంపు నివారణ..! పలు ప్రాంతాల్లో వరద నీటి డ్రెయిన్‌లు..!!

నగరంలో ముంపు నివారణ..! పలు ప్రాంతాల్లో వరద నీటి డ్రెయిన్‌లు..!!

వనస్థలిపురం చౌరస్తాలో భారీగా నిలుస్తోన్న వరద నీటితో తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతోన్న నేపథ్యంలో... నీరు సాఫీగా వెళ్లేందుకు వనస్థలిపురం చౌరస్తా నుంచి సుష్మా థియేటర్‌ మీదుగా మన్సురాబాద్‌ పెద్ద చెరువు వరకు 10.50 కోట్ల రూపాయలతో వాటర్‌ బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మించే ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. కామినేని జంక్షన్‌ నుంచి అల్కాపురి జంక్షన్‌ వరకు నిలుస్తోన్న వరద నీరు దిగువకు వెళ్లేలా రూ.3కోట్లతో వరద నీటి డ్రెయిన్‌ నిర్మాణానికి ఓకే చెప్పారు. హస్తినాపురంలోని దేవకి ఎన్‌క్లేవ్‌ నుంచి సివరేజ్‌ మెయిన్‌ లైన్‌ వరకు 800 ఎంఎం డయా సివరేజ్‌ లైన్‌ను రూ.3కోట్లతో నిర్మించే ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

నిర్మాణ ప్రతిపాదనలకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం..! రహదారుల విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..!!

నిర్మాణ ప్రతిపాదనలకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం..! రహదారుల విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..!!

చెత్త తరలింపు, అధికారుల కోసం వినియోగిస్తోన్న జీహెచ్‌ఎంసీ వాహనాల మరమ్మతు పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను వాహనాల టైర్లు, ట్యూబులు, ముడి చమురు, బ్యాటరీలు, టార్ఫాలిన్‌ షీట్లను 2.95 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసే అంశానికి ఆమోదం తెలిపారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మేయర్‌ నిధుల నుంచి మృతుల కుటుంబాలకు చెల్లించే పరిహారానికి స్టాండింగ్‌ కమిటీ ఆమోదం అవసరం లేదని సమావేశంలో నిర్ణయించారు. కీసర మండలం రాంపల్లిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో జనవరి 31న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు వ్యక్తుల కుటుంబాలకు పరిహారంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అంశాన్ని ఎజెండాలో చేర్చారు. మానవతా దృక్పథంతో ఒక్కో మృతుడి కుటుంబానికి 2లక్షల రూపాయలే ఇస్తోన్న దృష్ట్యా, కమిటీతో సంబంధం లేకుండా మేయర్‌ నిర్ణయం మేరకు వీలైతే వెంటనే పరిహారం అందించాలని కమిటీలో స్పష్టం చేశారు.

Recommended Video

హైదరాబాద్ లో భారీ వర్షం
వాహనాల మరమ్మతుకు..!పరిహారాలకు కమిటీ ఆమోదం అవసరం లేదు..!!

వాహనాల మరమ్మతుకు..!పరిహారాలకు కమిటీ ఆమోదం అవసరం లేదు..!!

4.10 కోట్ల రూపాయలతో బేగంబజార్‌ హోల్‌సేల్‌ ఫిష్‌ మార్కెట్‌లో అసంపూర్తిగా ఉన్న రెండో అంతస్తు, టెర్రస్‌ ఫ్లోర్‌ నిర్మాణం చేపట్టనున్నారు.
టోలిచౌకి వంతెన లిమ్రా హోటల్‌ నుంచి మహ్మదీయ లైన్‌, ఆంధ్రా ఫ్లోర్‌ మిల్‌, మిలిటరీ ఏరియా మీదుగా గోల్కొండ మోతీ దర్వాజ వరకు 18 మీటర్ల మేర రోడ్డు విస్తరణ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. బంజారా దర్వాజ నుంచి జీహెచ్‌ఎంసీ పరిధి (తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ బాయ్స్‌ జూనియర్‌ కళాశాల) వరకు 30 మీటర్ల మేర రోడ్డు విస్తరణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పరిహారం చెల్లింపు అధికారం మేయర్‌కే..!బేగంబజార్‌ ఫిష్‌ మార్కెట్‌ అసంపూర్తి పనులకు ఓకే..!!

పరిహారం చెల్లింపు అధికారం మేయర్‌కే..!బేగంబజార్‌ ఫిష్‌ మార్కెట్‌ అసంపూర్తి పనులకు ఓకే..!!

అంతే కాకుండా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు ఫ్లై ఓవర్‌ నుంచి భరత్‌నగర్‌ రైల్వే గూడ్స్‌ షెడ్‌ వరకు 60 మీటర్లకు బదులుగా.. 45 మీటర్ల రోడ్డు విస్తరణ కూడా ఆమోదం తెలిపింది సర్కార్. చందానగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వెంకటేశ్వరనగర్‌ సౌత్‌ లే అవుట్‌ వరకు, చందానగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వైశాలినగర్‌ నార్త్‌ వరకు 30 మీటర్ల మేర వెడల్పు చేసేందుకు సెముఖత వ్యక్తం చేసింది. గచ్చిబౌలి నుంచి హెచ్‌సీయూ మీదుగా బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌ వరకు కొన్ని ప్రాంతాల్లో 65, మరికొన్ని చోట్ల 45 మీటర్లకు విస్తరణతో పాటు, అంబర్‌పేట అలీకేఫ్‌ నుంచి పటేల్‌ నగర్‌ ఎస్‌టీపీ, నాగోల్‌ మెట్రో స్టేషన్‌, మెట్రో మాల్‌ మీదుగా నల్ల చెరువు వరకు 45 మీటర్ల మేర రోడ్డు విస్తరణ చేయనున్నట్టు అదికారులు స్పష్టం చేస్తున్నారు.

English summary
In the wake of the rainy season, the Standing Committee has taken a number of decisions to address traffic problems, prevent and prevent threats. The green signal has given rise to proposals to build box drains and culverts on major highways where flood waters are approaching.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X