వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నమ్మి వెంట వెళితే..: బావతోపాటు మరో ఇద్దరు గ్యాంగ్‌రేప్ చేశారు

|
Google Oneindia TeluguNews

వరంగల్: వరుసకు బావ అవుతాడని నమ్మి వెళితే.. అతనితోపాటు మరో ఇద్దరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లాలో కాజిపేటలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేస్తోంది. కరీంనగర్‌ జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం మల్యాల గ్రామానికి చెందిన పొన్నం అంజయ్య(30)కు ఆమె మరదలు వరుస.

కాగా, హైదరాబాద్‌ వచ్చిన అంజయ్య.. ఆ యువతి ఇంటికి వెళ్లాడు. అంజయ్య తోడుగా ఉంటాడన్న నమ్మకంతో మల్యాల గ్రామంలోని బంధువుల ఇంటికి బయలు దేరింది యువతి. వీరు సికింద్రాబాద్‌లో పుష్‌పుల్‌ రైలెక్కి కాజీపేటలో శనివారం రాత్రి 10-30 గంటలకు దిగారు.

rape

మల్యాల వెళ్లేందుకు మరో రైలు ఎక్కాలని ఆమెకు చెప్పిన అంజయ్య.. రైలు పట్టాల వెంట టౌన్‌స్టేషన సమీపంలోకి తీసుకొచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. వీరిద్దరిని పసిగట్టిన మరో ఇద్దరు... ఆమెను బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కాజీపేట పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, రాత్రి వేళల్లో సరైన గస్తీ లేకపోవడంతో ఇలాంటి వాటికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇతర ప్రాంతాల వారే కాకుండా జిల్లా వాసులు సైతం కాజీపేట రైల్వే స్టేషన్‌, టౌన్‌ స్టేషన్‌ పరిసరాలను చట్ట విరుద్ధ కార్యకలాపాలకు అడ్డాలుగా ఉపయోగించుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమ పనులు పూర్తయ్యాక వెంటనే రైలు ఎక్కి పారిపోవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రాంతాలను ఎంచుకొంటున్నట్లు తెలుస్తోంది. గతంలో స్థానిక రైల్వే క్వార్టర్స్‌లో మహిళలను అత్యాచారాలు చేసిన సంఘటనలు వెలుగు చూశాయి. హత్యలూ జరిగాయి. ఇప్పటికైనా కాజీపేట రైల్వే క్వార్టర్స్‌, జంక్షన్‌ పట్టాలపై రైల్వే, ప్రభుత్వ రైల్వే, సివిల్‌ పోలీసులు నిఘా పెంచి ఇలాంటి దారుణాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

English summary
A girl allegedly gangraped by her brother in law and other two in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X