వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంగార్డును కాలర్ పట్టుకుని కొట్టిన బిటెక్ విద్యార్థిని: అరెస్టు (వీడియో)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ యువతి తప్పు చేయడమే కాకుండా అడిగినందుకు హోంగార్డును చితకబాదింది. బైక్‌పై రాంగ్ రూట్‌లో వస్తున్న యువతి ఫొటో తీసేందుకు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హోం గార్డు ప్రయత్నించాడు. రాంగ్ రూట్‌లో వచ్చినందుకు ప్రశ్నించాడు.

దాంతో యువతి వీరంగం సృష్టించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని కీసరలో జరిగింది. హర్షిత అనే ఆ యువతి మరో వ్యక్తితో కలిసి రాంగ్ రూట్‌లో వాహనంపై వచ్చింది. దాన్ని ప్రశ్నించినప్పుడు యువతి వీరంగం వేస్తుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులదే తప్పని భావించారు.

Girl comes in wrong route and beats constable for questioning

కానీ అసలు విషయం తెలుసుకుని వారు విస్తుపోయారు. ఆమె పోలీసులపై వీరంగం వేసిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్న వెంకటేష్ యాదవ్ హైదరాబాద్ శివారులోని నాగారం, దమ్మాయిగూడ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నాడు.

అదే సమయంలో హర్షిత అనే యువతి, ఆమె మేనమామ కిషోర్ స్కూటీపై రాంగ్ రూట్‌లో వెళ్తూ ఉండగా హోంగార్డు ఫొటో తీశాడు. ఇది గమనించిన హర్షిత హోంగార్డుపై దాడి చేసింది. కాలర్ పట్టుకుని దూషించింది. విధుల్లో ఉన్న తనపై చేయిచేసుకున్న యువతిపై హోంగార్డు కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

హోంగార్డుపై దాడి చేసిన విద్యార్థిని హర్షిత లయోలా కాలేజీలో బిటెక్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు.

English summary
A girl harsitha has attacked Home gaurd for questioning her wrong route driving at Keesara in Ranga Reddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X