వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దలు కూడా ఒప్పుకున్నాక!: ప్రియుడి తీరుతో.. ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు

మోసపోతున్నానని ఆందోళన చెందిన రుచిత.. శశిధర్ ఇంటి ముందు బైఠాయించింది.

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి: ప్రేమించి పెళ్లికి కూడా ఒప్పుకున్న ఓ యువకుడు.. కొన్నాళ్లుగా ముఖం చాటేస్తుండటంతో ప్రియురాలు అతని ఇంటి ముందు బైఠాయించింది. ప్రియుడితో తన పెళ్లి జరిపించాలని ఆమె డిమాండ్ చేసింది.

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన ముద్దుల రుచిత(18), అదే ఊరుకు చెందిన మెట్టు శశిధర్(20) గత నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెద్దలు కూడా వీరి ప్రేమను అంగీకరించారు.

త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఇంతలోనే శశిధర్ ప్రవర్తన మారిపోయింది. రుచిత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం.. ఆమె నుంచి తప్పించుకు తిరగడం చేస్తూ వస్తున్నాడు.

దీంతో మోసపోతున్నానని ఆందోళన చెందిన రుచిత.. శశిధర్ ఇంటి ముందు బైఠాయించింది. శశిధర్ తనతో మాట్లాడట్లేదని, పెళ్లి అనగానే ముఖం చాటేశాడని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది.

English summary
A, Girl has staged protest infront of the house of her boyfriend, who has reportedly deceived her'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X