హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lockdown: రాత్రి దొమల బెడద, పగలు వేడి, హైదరాబాద్ క్యాంపులో వలసకూలీల వెతలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభించడంతో ఎక్కడివారు అక్కడే ఉంటున్నారు. వలస కూలీలకు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వసతి కల్పించాయి. కానీ అందులో ఉంటున్న వారు తమ సమస్యలను చెబుతున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో గల వసతి కేంద్రంలో 350 మంది ఉన్నారు. వసతి కేంద్రంలో పడుతోన్న ఇబ్బందులను వివరించారు.

350 మంది..

350 మంది..


నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన వసతి కేంద్రంలో తులసీరామ్ సహా 350 మంది ఉంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, బీహర్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతోపాటు నేపాల్‌కి చెందినవారు కూడా ఉన్నారు. వీరంతా ఆయా రెస్టారెంట్, క్యాటరింగ్ సర్వీస్, భవన నిర్మాణ పని చేసేవారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వీరు వసతి కేంద్రానికి తరలివెళ్లారు.

4 టాయిలెట్లు..

4 టాయిలెట్లు..


వలస కూలీలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఓపెన్ ప్లేస్‌లో వసతి కల్పించారు. బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల పైన్ సన్నటి రూఫ్ ఏర్పాటు చేశారు. కింద గ్రీన్ కార్పెట్ వేశారు. ఇక్కడే 350 మంది ఉండగా.. కేవలం 4 టాయిలెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీరికి పొద్దు గడవాలంటే ఫోన్‌తో ఆడతారు. తర్వాత కార్డులు ఆడి.. ఒకరితో ఒకరు మాట్లాడతారు. తమ కుటుంబాలను మిస్ అవుతున్నామని వికాస్ అనే కూలీ పేర్కొన్నారు. ఎలాగోలా గడిపేస్తున్నామని చెప్పారు. రాత్రి పూట దోమలు స్వైరం విహారం చేస్తున్నాయని.. దీంతో నిద్రపోవడం లేదన్నారు. మధ్యాహ్నం వేడిమికి నిద్ర రావడం లేదు అని తమ గోడును వెల్లబోసుకున్నారు.

సిటీలో చిక్కి..

సిటీలో చిక్కి..

శ్రీకాకుళానికి చెందిన కుమార్ అనే కార్మికుడు కూడా తన బాధను వివరించాడు. వాస్తవానికి 3 నెలలు హైదరాబాద్‌లో కూలీగా పనిచేసి.. డబ్బు జమచేసి తన ఇంటికి వెళ్లిపోయేవాడు. అయితే లాక్ డౌన్ కంటే ముందు ఇక్కడే చిక్కుకున్నాడు. తన వద్ద ఉన్న డబ్బుతో నారాయణగూడలో లాడ్జ్‌లో బస చేశాడు. డబ్బులు అయిపోవడంతో.. మార్చి 23వ తేదీన పోలీసులు శిబిరానికి తరలించేవారితో కలిసిపోయారు. లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించడంతో తాను ఎలా ఇంటికి చేరుకోవాలనే అంశంపై మదనపడిపోతున్నాడు.

నో సిగరెట్, నో లిక్కర్

నో సిగరెట్, నో లిక్కర్

తన గురించి తల్లిదండ్రులు బాధపడుతున్నారని.. వారికి ఏం జరిగినా తాను వెళ్లలేని స్థితిలో ఉన్నానని.. తనకేం జరిగినా వారు రాలేని స్థితిలో ఉన్నారని కుమార్ పేర్కొన్నారు. తమలాంటి వారి కోసం ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. అంతేకాదు ఇక్కడున్న వారు చాలామంది సిగరేట్ తాగే అలవాటు ఉందని, మందు తాగేవారని, గుట్కా తినేవారు అని.. కానీ ఇప్పుడు ఏమీ లభించకపోవడంతో మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు.

4 గంటలకు లేచి..

4 గంటలకు లేచి..


విజయవాడకు చెందిన రాకేశ్ మాట్లాడుతూ.. ఇక్కడ ఆహారం బాగోలేదని చెప్పారు. ఇక్కడ ఆహారం కోసం నిల్చొవాలి, అన్నం కోసం నిల్చొవాలి.. అని వాపోయాడు. ప్రతీరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేస్తామని... దీంతో క్యూ బాధ ఉండదని చెప్పారు. ఆహారం కోసం అరగంటపాటు క్యూలో నిల్చుంటామని పేర్కొన్నారు. వసతి కేంద్రంలో సోషల్ డిస్టన్స్ పాటిస్తామని.. ఒకరికి మరొకరు మీటర్ దూరంలో ఉంటారని పేర్కొన్నారు.

Recommended Video

Coronavirus : Two Constables Tests Positive For Covid-19 In Hyderabad

English summary
“At night, the mosquitoes haunt us and at noon, the heat won’t let us sleep," one of the migrant worker vikas at the camp said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X