వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇల్లు అద్దెకిస్తున్నారా?.. జాగ్రత్త! నైజీరియన్లకిస్తే చిక్కులే.. యజమానులు జైలుకే!

గృహ యజమానులూ.. జాగ్రత్త! విదేశీయులకు ప్రత్యేకించి నైజీరియన్లకు వారి గుర్తింపు కార్డులు తీసుకోకుండా ఇళ్లు అద్దెకిస్తే చిక్కుల్లోపడటం ఖాయం.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గృహ యజమానులూ.. జాగ్రత్త! విదేశీయులకు ప్రత్యేకించి నైజీరియన్లకు వారి గుర్తింపు కార్డులు తీసుకోకుండా ఇళ్లు అద్దెకిస్తే చిక్కుల్లోపడటం ఖాయం. ఎందుకంటే, నిబంధనలు ఉల్లంఘించి నైజీరియన్లకు ఇళ్లను అద్దెకిస్తున్న యజమానులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.

నగరంలోని నార్సింగ్‌లో ఓ నైజీరియన్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వీసా గడువు పూర్తయి రెండేళ్లయినా యథేచ్ఛగా ఉండటమే కాదు.. అతడు అద్దెకు తీసుకున్న ఇంట్లోనే దర్జాగా వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నాడు.

తెలియదంటే కుదర్దు...

తెలియదంటే కుదర్దు...

నిందితుడికి ఇల్లు అద్దెకిచ్చిన వ్యక్తికి రూల్స్‌ తెలియవేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇంటి యజమాని ఓ ప్రభుత్వోద్యోగి. అద్దె ఎక్కువిస్తాననడంతో సదరు నైజీరియన్ నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకోకుండానే ఇంటిని అద్దెకిచ్చేశాడు!

ఇవీ నిబంధనలు...

ఇవీ నిబంధనలు...

పోలీసుల నిబంధన ప్రకారం విదేశీయులకు ఇల్లు అద్దెకిచ్చే యజమానులు వారి పాస్‌పోర్ట్‌, వీసా నకలును తీసుకోవాలి. స్థానిక పోలీ‌సస్టేషన్లలో వారి వివరాలు అందజేయాలి. వారి కదలికలపై ఎటువంటి అనుమానం వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలి.

మితిమీరుతున్న నైజీరియన్ల ఆగడాలు...

మితిమీరుతున్న నైజీరియన్ల ఆగడాలు...

హైదరాబాద్‌లో నైజీరియన్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రత్యేకంగా డ్రగ్స్‌ మాఫియా, దోపిడీల్లో నైజీరియన్ల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు ఇరుగుపొరుగుతో గొడవలు పడి దౌర్జన్యాలకు దిగుతున్నారు. నైజీరియన్లపై ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు.

చెప్పేదొకటి.. చేసేదొకటి...

చెప్పేదొకటి.. చేసేదొకటి...

యాప్రాల్‌ సమీపంలో రెండేళ్లుగా గాబ్రియేల్‌ అనే నైజీరియన్‌ ఉంటున్నాడు. చేసేది గుట్టుగా కొకైన్‌ బిజినెస్‌. సూడాన్‌ నుంచి వచ్చానని, ఓయూలో బీకాం చదువుతున్నట్టు ఇంటి యజమానిని నమ్మించాడు. మిగతా కిరాయిదార్లకన్నా ఎక్కువ అద్దె ఇస్తానని ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నాడు. కొన్నాళ్లకు ఆ ఫ్లాట్‌కు వచ్చే వారి సంఖ్య పెరగటంతో చుట్టుపక్కల వాళ్లు నిలదీశారు. దీంతో గాబ్రియేల్‌ తన గ్యాంగ్‌తో వారిని బెదిరించాడు.

గంజాయి మత్తులో...

గంజాయి మత్తులో...

టోలిచౌకి సమీపంలో నలుగురు నైజీరియన్లు గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఆ మత్తులో కొన్నిసార్లు అక్కడి యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీసా గడువు ముగిసినా...

వీసా గడువు ముగిసినా...

పై రెండు ఘటనలపై విచారణ జరిపిన పోలీసులు వాళ్ల వీసా గడువు ముగిసినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఇటీవల గ్రేటర్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 6 వేల మంది నైజీరియన్ల వివరాలను పోలీసులు రాబట్టారు. వీరిలో 60 మంది వీసా గడువు ముగిసిన వాళ్లున్నారు. ఈ నేపథ్యంలో వివరాలు తెలుసుకోకుండానే ఇల్లును అద్దెకిచ్చిన 10 మంది యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

English summary
House Owners.. Be Careful.. and check before you give your house on rent to anybody.. that too particularly for nigerians. Because some of the nigerians are staying in our country after their Visa get expired. And also they are involving illegal trade, crimes. This is the serious warning to the House Owners by the Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X