హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్లోబల్ సదస్సులో దిమ్మతిరిగే షాక్: కేటీఆర్‌కు ఊహించని ప్రశ్న, సానియా ఏమన్నారంటే

హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని ప్రశ్న ఎదురైంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇవాంకా ట్రంప్, చందా కొచ్చార్ తదితరులతో కలిసి ఆయన వేదికను పంచుకున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రులు లేకపోవడంపై ఆయనకు ప్రశ్న ఎదురయింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో మహిళా మంత్రులు లేకపోవడంపై ఇప్పటికే విపక్షాలు విమర్శిస్తున్నాయి.

హైదరాబాద్ బిర్యానీ, టీ అమ్ముకున్న మోడీ, భారత్ మాకు ఆదర్శం: ఇవాంకాహైదరాబాద్ బిర్యానీ, టీ అమ్ముకున్న మోడీ, భారత్ మాకు ఆదర్శం: ఇవాంకా

గ్లోబల్ సదస్సు వేదికపై కేటీఆర్‌కు ఊహించని ప్రశ్న

గ్లోబల్ సదస్సు వేదికపై కేటీఆర్‌కు ఊహించని ప్రశ్న

ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ వేదికగా మీడియాతో మాట్లాడుతుండగా కేటీఆర్‌కు మహిళా మంత్రుల గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. మహిళలకు అవకాశాలు, సాధికారతపై ఆయన మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఎందుకు లేరని ప్రశ్నించారు. దీనిపై సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన చాకచక్యంగా సమాధానం ఇచ్చారు.

Recommended Video

GES 2017: Ivanka Trump
ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు

ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు

తమ ప్రభుత్వంలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, మంత్రి పదవులపై సీఎం కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ చెప్పారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిథ్యం పెంచాలన్న వాదనకు తాము కట్టుబడి ఉన్నామని, మహిళా బిల్లుకు మా పార్టీ మద్దతు ఇస్తోందని చెప్పారు. ఇప్పటికే దీనిపై శాసన సభలో తీర్మానం చేశామని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళల కోసం పోరాడే వేదిక హైదరాబాద్ కావడం ఆనందదాయకం అన్నారు.

రాత్రికి రాత్రే ఎవరూ కాలేరు

రాత్రికి రాత్రే ఎవరూ కాలేరు

ఇదిలా ఉండగా, గ్లోబల్ సమ్మిట్ వేదికపై సానియా మీర్జా, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్‌లు మాట్లాడారు. హర్షాబోగ్లే సమన్వయకర్తగా వ్యవహరించారు. టెన్నిస్, క్రికెట్ లాంటి క్రీడల్లో మహిళలు రాణిస్తున్నారని సానియా తెలిపారు. రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరన్నారు. క్రీడల్లో మహిళలను మరింత ప్రోత్సహించాలన్నారు.

ప్రోత్సహించాలి

ప్రోత్సహించాలి

క్రీడారంగంలో మహిళలు రాణిస్తున్నారని గోపీచంద్ అన్నారు. భారత్‌లో క్రీడాకారులు అన్ని ఆటల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. పిల్లలను క్రీడల పట్ల తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అమ్మాయిలు క్రికెట్ ఆడేందుకు ముందుకు వస్తున్నారని మిథాలీ రాజ్ అన్నారు. చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆట స్థలాలు లేవని వాపోయారు.

అదృష్టం కొద్ది క్రీడాకారుడు మంత్రి అయ్యారు

అదృష్టం కొద్ది క్రీడాకారుడు మంత్రి అయ్యారు

రాజకీయ నాయకులు క్రీడల్లోకి చొరబడుతున్నారని హర్షాబోగ్లే అభిప్రాయపడ్డారు. అదృష్టం కొద్ది ఇప్పుడు ఓ క్రీడాకారుడు క్రీడామంత్రి అయ్యారని గుర్తు చేశారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ మూడు రోజుల పాటు జరగనుంది. మంగళవారం ప్రారంభమైంది.

English summary
Media question Telangana Minister KT Rama Rao about minister berth in Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao cabinet.హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని ప్రశ్న ఎదురైంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X