వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైకెక్కిన మంత్రి, కెసిఆర్‌కు జానా పొగడ్త, తుమ్మల ఆప్యాయత (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పుష్కరాలతో గోదావరి తీరం భక్తులతో కళకళలాడుతోంది. పుష్కరాలు ప్రారంభమై తొమ్మిది రోజులు అవుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.

పుష్కరాలకు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో భక్తులు మరింత పోటెత్తుతున్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్రంలో యాభై వేల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు.

హైదరాబాదు నుండి పెద్ద సంఖ్యలో పోచంపాడు, బాసర, కాళేశ్వరం తరలిపోతున్నారు. కర్నాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

కరీంనగర్ జిల్లాలో పుష్కర స్నానాలకు భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడంలేదు. జిల్లాలోని 39 పుష్కరఘాట్లలో బుధవారం 21 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ధర్మపురిలో 10 లక్షలు, కాళేశ్వరంలో 5 లక్షలు, మంథనిలో 2 లక్షలు, కోటిలింగాలలో 3 లక్షలు, మిగిలిన ఘాట్ల పరిధిలో లక్ష మంది పుష్కరస్నానాలు చేశారు. కోటిలింగాలకు భారీ ఎత్తున భక్తులు తరలిరావడంతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

డీజీపీ అనురాగ్ శర్మ ధర్మపురి, కాళేశ్వరంలో పర్యటించారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

నిజామాబాద్ జిల్లాలో బుధవారం 10,23,812 మంది భక్తులు పుష్కరస్నానాలు చేశారు. ఒక్క పోచంపాడ్‌లోనే 4,26,320 మంది స్నానాలు చేశారు. కందకుర్తిలో 1.85 లక్షలు, తడ్‌పాకల్‌లో 1.59 లక్షలు, తుంగినిలో 1.05 లక్షలు, మిగిలినవారు మరో ఏడు ఘాట్లలో స్నానాలు ఆచరించారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పోచంపాడ్‌లో ఎమ్మెల్సీ రంగారెడ్డి, ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఘాట్లను పరిశీలించారు. తడపాకల్, దోమ్‌చంద, గుమ్మిర్యాల్ ఘాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సందర్శించి పూజలు చేశారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గుంటూరుకు చెందిన 105 ఏండ్ల శ్రీ రామానందతీర్థ యతీశ్వరులు కందకుర్తికి వచ్చి పుష్కర స్నానం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 లక్షల మంది స్నానాలు చేశారు. నిర్మల్ మండలం సోన్‌లో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు పర్యటించారు. ఖానాపూర్‌లో మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే రేఖానాయక్, జన్నారంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పూజలు చేశారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, మంగపేట ఘాట్లలో బుధవారం సుమారు నాలుగు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని అధికార యంత్రాంగం ప్రకటించింది.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఖమ్మం జిల్లాలో కుండపోతలా కురిసిన వర్షంలోనే భక్తులు పుష్కరస్నానమాచరించారు. బుధవారం 6 లక్షలకు పైగా భక్తులు భద్రాచలం తరలివచ్చారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావుగౌడ్ బూర్గంపాడు మండలం మోతెలో పుష్కరస్నానం చేశారు. అనంతరం భద్రాచలం చేరుకొని శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

కాంగ్రెస్ శాసనసభా పక్షనేత కుందూరు జానారెడ్డి మోతెలో కుటుంబ సమేతంగా పుష్కరస్నానం చేసి శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న గోదావరి మహాపుష్కరాలకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. జానాను తుమ్మల అన్నా అంటూ పలకరించి స్వాగతం పలికారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతోపాటు సుదూరంగా ఉన్న బీహార్ రాష్ట్రం నుంచి కూడా భద్రాద్రికి పుష్కరస్నానాలకు భక్తులు వస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

English summary
Many people are coming from Hyderabad, Karnataka and Maharashtra to take holy dip in Godavari river.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X