వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో వైభవంగా పుష్కరాలు: 15లక్షలమంది స్నానాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కరీంనగర్: గోదావరి మహా పుష్కరాలు తెలంగాణలో రెండో రోజు వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ పది జిల్లాలనుంచి తండోపతండాలుగా భక్తజనసందోహం గోదావరి తీరానికి చేరుకొని పవిత్ర పుష్కర స్నానాలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 6.26 గంటలకు దేవ గురువు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించగానే ధర్మపురి క్షేత్రంలో పలువురు పీఠాధిపతులు, వేద పండితులు గోదావరి నదీమతల్లి ఒడిలో శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు.

అనంతరం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులతో పుష్కర స్నానం చేయించారు. దీంతో మహా పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇదే క్షేత్రంలో సీఎంతోపాటు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పవిత్రస్నానం ఆచరించారు.

అప్పటికే ధర్మపురి క్షేత్రానికి తరలివచ్చిన భక్తజనం గోదావరి నదిలో పవిత్రస్నానం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దర్శనం చేసుకుంటానని మొక్కిన మొక్కును తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి చెల్లించుకున్నారు. సతీసమేతంగా పుష్కరస్నానం చేసి గోదావరి తల్లి రుణం తీర్చుకున్నారు. ఇదే ముహూర్తానికి రాష్ట్రంలోని ప్రధాన క్షేత్రాల్లో పవిత్ర పుష్కర స్నానాలు మొదలయ్యాయి.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గోదావరి మహా పుష్కరాలు తెలంగాణలో రెండో రోజు వైభవంగా సాగుతున్నాయి.

ధర్మపురిలో స్నానాలు

ధర్మపురిలో స్నానాలు

తెలంగాణ పది జిల్లాలనుంచి తండోపతండాలుగా భక్తజనసందోహం గోదావరి తీరానికి చేరుకొని పవిత్ర పుష్కర స్నానాలు చేస్తున్నారు.

ధర్మపురిలో..

ధర్మపురిలో..

మంగళవారం ఉదయం 6.26 గంటలకు దేవ గురువు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించగానే ధర్మపురి క్షేత్రంలో పలువురు పీఠాధిపతులు, వేద పండితులు గోదావరి నదీమతల్లి ఒడిలో శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు.

పుష్కర పైలాన్

పుష్కర పైలాన్

అనంతరం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులతో పుష్కర స్నానం చేయించారు. దీంతో మహా పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

ధర్మపురిలో..

ధర్మపురిలో..

ఇదే క్షేత్రంలో సీఎంతోపాటు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పవిత్రస్నానం ఆచరించారు.

ధర్మపురిలో..

ధర్మపురిలో..

అప్పటికే ధర్మపురి క్షేత్రానికి తరలివచ్చిన భక్తజనం గోదావరి నదిలో పవిత్రస్నానం చేశారు.

ధర్మపురిలో..

ధర్మపురిలో..


తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దర్శనం చేసుకుంటానని మొక్కిన మొక్కును తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి చెల్లించుకున్నారు.

ధర్మపురిలో..

ధర్మపురిలో..

సతీసమేతంగా పుష్కరస్నానం చేసి గోదావరి తల్లి రుణం తీర్చుకున్నారు. ఇదే ముహూర్తానికి రాష్ట్రంలోని ప్రధాన క్షేత్రాల్లో పవిత్ర పుష్కర స్నానాలు మొదలయ్యాయి.

ధర్మపురిలో..

ధర్మపురిలో..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులతో పండితులు మహా సంకల్పం నిర్వహింపజేశారు.

ధర్మపురిలో..

ధర్మపురిలో..


అనంతరం సీఎం దంపతులు గోదావరి మాతకు పసుపు కుంకుమ, పూలహారం, పట్టు వస్ర్తాలు సమర్పించి.. పుష్కరస్నానాన్ని ఆచరించారు.

ధర్మపురిలో..

ధర్మపురిలో..

పుష్కరాల్లో మొదటి రోజు సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి దంపతులు విప్రులకు సువర్ణ దానం చేశారు.

భద్రాచలంలో..

భద్రాచలంలో..

భద్రాచలంలో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి సారథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులు దేవతామూర్తులకు స్నపనం చేశారు.

భద్రాచలంలో..

భద్రాచలంలో..

ఆ వెంటనే త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామీజీ యతీంద్రస్నానం చేశారు.

భద్రాచలంలో..

భద్రాచలంలో..


పుష్కరాలు ప్రారంభంకాగానే మంత్రులు టి హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, మైంహోం సీఎండీ జూపల్లి రామేశ్వరరావు ఇతర ప్రముఖులు పవిత్ర స్నానంచేశారు.

భద్రాచలంలో..

భద్రాచలంలో..

పుష్కరాలు ప్రారంభంకాగానే మంత్రులు టి హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, మైంహోం సీఎండీ జూపల్లి రామేశ్వరరావు ఇతర ప్రముఖులు పవిత్ర స్నానంచేశారు.

భద్రాచలంలో..

భద్రాచలంలో..

భద్రాచలం పుష్కరఘాట్‌లను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ పర్యవేక్షించారు.

వరంగల్ జిల్లాలో..

వరంగల్ జిల్లాలో..

వరంగల్‌ జిల్లాలోని మంగపేట స్నానఘట్టంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గోదావరి పుష్కరాలకు అంకురార్పణ చేసి పుష్కరస్నానం చేశారు.

వరంగల్ జిల్లాలో..

వరంగల్ జిల్లాలో..

పార్లమెంట్ సభ్యులు సీతారాంనాయక్, సమాచారశారశాఖ కమిషనర్ బీపీ ఆచార్య తదితరులు ఇక్కడ పవిత్రస్నానం చేసి తర్పణాలు ఇచ్చారు.

వరంగల్ జిల్లాలో..

వరంగల్ జిల్లాలో..

వరంగల్‌లో మూడు స్నానఘట్టాలలో కలిపి మూడులక్షల మంది స్నానం చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

కాళేశ్వరంలో..

కాళేశ్వరంలో..

కరీంనగర్‌లో 39 స్నానఘట్టాలలో కలిపి రాత్రి 9గంటల వరకు 6లక్షల 50వేల మంది భక్తులు పవిత్రస్నానాలను అచరించారు.

కాళేశ్వరంలో..

కాళేశ్వరంలో..

కాళేశ్వరలో రెండు లక్షల మంది భక్తులు, ధర్మపురిలో 2లక్షల మంది భక్తులు పుష్కరస్నానం చేశారు. కాళేశ్వరంలో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పుణ్యస్నానం చేశారు.

భద్రాచలంలో..

భద్రాచలంలో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి సారథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులు దేవతామూర్తులకు స్నపనం చేశారు. ఆ వెంటనే త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామీజీ యతీంద్రస్నానం చేశారు. పుష్కరాలు ప్రారంభంకాగానే మంత్రులు టి హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, మైంహోం సీఎండీ జూపల్లి రామేశ్వరరావు ఇతర ప్రముఖులు పవిత్ర స్నానంచేశారు.

మంగపేటలో..

వరంగల్‌ జిల్లాలోని మంగపేట స్నానఘట్టంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గోదావరి పుష్కరాలకు అంకురార్పణ చేసి పుష్కరస్నానం చేశారు. పార్లమెంట్ సభ్యులు సీతారాంనాయక్, సమాచారశారశాఖ కమిషనర్ బీపీ ఆచార్య తదితరులు ఇక్కడ పవిత్రస్నానం చేసి తర్పణాలు ఇచ్చారు. వరంగల్‌లో మూడు స్నానఘట్టాలలో కలిపి మూడులక్షల మంది స్నానం చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో 11 ప్రాంతాలలో 18 స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పార్లమెంటు సభ్యురాలు కవిత ఇక్కడ పుష్కరాలను ప్రారంభించారు. 18 స్నానఘట్టాలలో కలిసి సాయంత్రం 5గంటలవరకు లక్షా 80వేల మంది భక్తులు పుష్కరస్నానాలను చేశారు.

కాళేశ్వరంలో..

కరీంనగర్‌లో 39 స్నానఘట్టాలలో కలిపి రాత్రి 9గంటల వరకు 6లక్షల 50వేల మంది భక్తులు పవిత్రస్నానాలను అచరించారు. కాళేశ్వరలో రెండు లక్షల మంది భక్తులు, ధర్మపురిలో 2లక్షల మంది భక్తులు పుష్కరస్నానం చేశారు. కాళేశ్వరంలో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పుణ్యస్నానం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో..

ఆదిలాబాద్‌లో 3లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు, ఒక్క బాసరలోనే లక్షా 50వేల మంది భక్తులు పుణ్యస్నానమాచరించారు. తెలంగాణలోనీ అన్నీ స్నానఘట్టాలలో సౌకర్యవంతంగా, విశాలంగా, స్నానఘట్టాలు ఉండటంతో భక్తులు నెమ్మదిగా స్నానాలను చేశారు. మెట్లు దిగి స్నానాలు చేయలేని వారికోసం షవర్‌లు, నల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో పిల్లలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కాగా, మొదటి రోజు సుమారు 15 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

English summary
The Godavari Maha Pushkaralu, the once in 144-years event to worship the river commenced on a religious note in five districts of Telangana through which the mighty river flows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X