వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైభవంగా ముగిసిన పుష్కరాలు: స్నానమాచరించిన 6కోట్ల భక్తులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన గోదావరి మహాపుష్కరాలు ఘనంగా ముగిశాయి. పన్నెండు రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి నుంచి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు గోదావరి తీరం భక్త జనప్రవాహాన్ని తలపించింది. 12 రోజుల్లో దాదాపు 6కోట్ల మందికిపైగా భక్తులు పుష్కరస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు.

చివరిరోజైన శనివారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. 49,17,225 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆది పుష్కరాల ముగింపు వేడుకలను 106 ఘాట్లలో గోదావరి నదీమాతకు హారతి ఇచ్చి కన్నుల పండువగా నిర్వహించారు. వచ్చే ఏడాది జూలైలో గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించి ముగింపు ఉత్సవాలను అధికారికంగా మరోసారి నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా పుష్కరుడు గోదావరిలో ఉంటాడని, ఏడాదంతా పుష్కరస్నానం యోగ్యమేనని పండితులు చెప్పారు.

చివరి రోజు పోటెత్తిన భక్తులు

ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 92.50లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేయగా, చివరి రోజు 14లక్షల మంది స్నానాలు చేశారు. బాసరలో 4 లక్షలు, మంచిర్యాలలో 4.10 లక్షల మంది స్నానం చేశారు. బాసరలో ఉత్సవ విగ్రహాలతో దేవాలయం నుంచి గోదావరి వరకు శోభయాత్రగా వెళ్లి గోదావరికి పూజలు చేసి హారతి ఇచ్చారు.

కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, జిల్లా కలెక్టర్ ఎం జగన్మోహన్, ఎస్పీ టీ తరుణ్‌జోషి, బాసర దేవాలయ ఈవో రమణమూర్తి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం కోటి 80 లక్షల మంది స్నానమాచరించగా, చివరి రోజు 10.16 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించారు.

కరీంనగర్‌లో..

ధర్మపురిలో 4.10 లక్షలు, కాళేశ్వరంలో 2.60 లక్షలు, కోటిలింగాలలో 85వేలు, మంథనిలో 64వేల మంది పుష్కరస్నానాలు చేశారు. మల్లాపూర్ మండలం వాల్గొండ పుష్కరఘాట్ వద్ద సీఎం కెసిఆర్ తోడల్లుడు రవీందర్-శశికళ దంపతులు పుణ్యస్నానం చేశారు.

ధర్మపురిలో గోదావరికి మంత్రి ఈటెల రాజేందర్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, పరిపూర్ణానంద సరస్వతి ఆధ్వర్యంలో గోదావరికి మహా హారతి ఇచ్చారు. కాళేశ్వరంలో స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీలు కవిత, వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యే పుట్ట మధు పూజలు చేశారు.

వరంగల్ జిల్లాలో..

వరంగల్ జిల్లాలో మొత్తం 27 లక్షల మంది స్నానం చేయగా, శనివారం మంగపేట, ఏటూరునాగారం మండలం రామన్నగూడెం ఘాట్లలో రెండు లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు.

ముగింపు మహోత్సవానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా ఇంఛార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, వరంగల్, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్లు గద్దల పద్మ, తుల ఉమ, మాజీ ఎమ్మెల్యేలు మొలుగూరి భిక్షపతి, బొజ్జపల్లి రాజయ్య హాజరయ్యారు.

నిజామాబాద్ జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో శనివారం 17.01 లక్షల మంది స్నానాలకు తరలివచ్చారు. పన్నెండు రోజుల్లో 1.03 కోట్ల మంది స్నానాలు చేశారు. కందకుర్తిలో 4,91,500 మంది, పోచంపాడ్‌లో 4,60,750 మంది స్నానాలు చేశారు.

కందకుర్తిలో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పీఠాధిపతి జగద్గురు భీమశంకర శివాచార్య మహాస్వామి, కర్నాటకలోని రంభాపురి పీఠాధిపతి జగద్గురు వీరప్రసన్న సోమలింగేశ్వర శివాచార్య మహాస్వామి, అహ్మద్‌పూర్ స్వా మీజీ డాక్టర్ శివానంద్ శివాచార్య, బిచ్కుంద మఠానికి చెందిన సోమలింగాయప్ప శివాచార్య పుష్కరస్నానాలు చేశారు.

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర జంగమ సమాజం అధ్యక్షుడు విశ్వేశ్వరయ్య స్నానం చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గంగా హారతి ఇచ్చారు. పోచంపాడ్‌లో టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, కాలే యాదయ్య, సినీ నిర్మాత బెల్లం కొండ సురేశ్ పుష్కరస్నానాలు చేశారు. ఉమ్మెడలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్నానం చేశారు.

ఖమ్మం జిల్లాలో..

ఖమ్మం జిల్లాలో చివరి రోజు ఆరు లక్షల మంది, పన్నెండు రోజుల్లో 76 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి చివరి రోజు పుష్కర ఘాట్లను సందర్శించారు. సాయంత్రం గోదావరి మాతకు మహా హారతి ఇచ్చి ఆది పుష్కరాలకు ముగింపు పలికారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన గోదావరి మహాపుష్కరాలు అగరంగ వైభవంగా ముగిశాయి.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

పన్నెండు రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి నుంచి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు గోదావరి తీరం భక్త జనప్రవాహాన్ని తలపించింది.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

12 రోజుల్లో దాదాపు 6కోట్ల మందికిపైగా భక్తులు పుష్కరస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

చివరిరోజైన శనివారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. 49,17,225 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

ఆది పుష్కరాల ముగింపు వేడుకలను 106 ఘాట్లలో గోదావరి నదీమాతకు హారతి ఇచ్చి కన్నుల పండువగా నిర్వహించారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

వచ్చే ఏడాది జూలైలో గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించి ముగింపు ఉత్సవాలను అధికారికంగా మరోసారి నిర్వహించనున్నారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

ఏడాది పొడవునా పుష్కరుడు గోదావరిలో ఉంటాడని, ఏడాదంతా పుష్కరస్నానం యోగ్యమేనని పండితులు చెప్పారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 92.50లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేయగా, చివరి రోజు 14లక్షల మంది స్నానాలు చేశారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

బాసరలో 4 లక్షలు, మంచిర్యాలలో 4.10 లక్షల మంది స్నానం చేశారు. బాసరలో ఉత్సవ విగ్రహాలతో దేవాలయం నుంచి గోదావరి వరకు శోభయాత్రగా వెళ్లి గోదావరికి పూజలు చేసి హారతి ఇచ్చారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, జిల్లా కలెక్టర్ ఎం జగన్మోహన్, ఎస్పీ టీ తరుణ్‌జోషి, బాసర దేవాలయ ఈవో రమణమూర్తి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 92.50లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేయగా, చివరి రోజు 14లక్షల మంది స్నానాలు చేశారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

బాసరలో 4 లక్షలు, మంచిర్యాలలో 4.10 లక్షల మంది స్నానం చేశారు. బాసరలో ఉత్సవ విగ్రహాలతో దేవాలయం నుంచి గోదావరి వరకు శోభయాత్రగా వెళ్లి గోదావరికి పూజలు చేసి హారతి ఇచ్చారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

బాసరలో ఉత్సవ విగ్రహాలతో దేవాలయం నుంచి గోదావరి వరకు శోభయాత్రగా వెళ్లి గోదావరికి పూజలు చేసి హారతి ఇచ్చారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, జిల్లా కలెక్టర్ ఎం జగన్మోహన్, ఎస్పీ టీ తరుణ్‌జోషి, బాసర దేవాలయ ఈవో రమణమూర్తి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

కరీంనగర్ జిల్లాలో మొత్తం కోటి 80 లక్షల మంది స్నానమాచరించగా, చివరి రోజు 10.16 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

ధర్మపురిలో 4.10 లక్షలు, కాళేశ్వరంలో 2.60 లక్షలు, కోటిలింగాలలో 85వేలు, మంథనిలో 64వేల మంది పుష్కరస్నానాలు చేశారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

మల్లాపూర్ మండలం వాల్గొండ పుష్కరఘాట్ వద్ద సీఎం కెసిఆర్ తోడల్లుడు రవీందర్-శశికళ దంపతులు పుణ్యస్నానం చేశారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

ధర్మపురిలో గోదావరికి మంత్రి ఈటెల రాజేందర్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, పరిపూర్ణానంద సరస్వతి ఆధ్వర్యంలో గోదావరికి మహా హారతి ఇచ్చారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

కాళేశ్వరంలో స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీలు కవిత, వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యే పుట్ట మధు పూజలు చేశారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

కరీంనగర్ జిల్లాలో మొత్తం కోటి 80 లక్షల మంది స్నానమాచరించగా, చివరి రోజు 10.16 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించారు.

పుష్కరాల ముగింపు

పుష్కరాల ముగింపు

కరీంనగర్ జిల్లాలో మొత్తం కోటి 80 లక్షల మంది స్నానమాచరించగా, చివరి రోజు 10.16 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించారు.

English summary
Godavari Pushkaralu ended in Telangana state and 6 crore people have bath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X