వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుత సిఎం: పుష్కర స్నానమాచరించిన సినీ తారలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కరీంనగర్: గోదావరి పుష్కరాలకు భక్తులు వెల్లువలా తరలివస్తున్నారు. వారాంతపు సెలవు రోజులైన శని ఆదివారాలతో పోటీ పడి సోమవారం కూడా అనూహ్యంగా సుమారు 44 లక్షల మంది ప్రజలు పుణ్యస్నానాలు చేశారు. పుష్కరఘాట్లు యథావిధిగా జనంతో కిక్కిరిసి పోగా ఆలయాలు కిటకిటలాడాయి.

పుష్కరాలు ఏడో రోజుకు చేరినా రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. కాగా, సోమవారం పలువురు సినీ ప్రముఖులు పుష్కర స్నానాలు ఆచరించారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, సినీ నటులు వేణు మాధవ్, ఆయన కుటుంబసభ్యులు, కృష్ణుడు తదితరులు పుష్కర స్నానమాచరించారు. ఈ సందర్భంగా నటుడు వేణు మాధవ్ మాట్లాడుతూ.. పుష్కరాల ఏర్పాట్లు చాలా బాగుతున్నాయని చెప్పారు. సిఎం కెసిఆర్.. పుష్కర ఏర్పాట్లను అద్భుతంగా చేశారని ప్రశంసించారు.

కాగా, కందకుర్తి నుండి భద్రాచలం వరకు పుష్కర ఘాట్లు భక్తులతో నిండిపోగా ఆలయాలు భగవన్నామనామ స్మరణతో మార్మోగాయి. భక్తుల సందోహం గంటగంటకు పెరుగుతూ వచ్చింది. పుష్కర స్నానాలకు సోమవారం పక్క రాష్ర్టాలనుంచి కూడా భక్తులు తరలివచ్చారు. భద్రాచలానికి ఏపీ నుంచి, కాళేశ్వరం, కందకుర్తి, బాసరకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి భక్తుల తాకిడి పెరిగింది.

పుష్కర స్నానాలు

పుష్కర స్నానాలు

గోదావరి పుష్కరాలకు భక్తులు వెల్లువలా తరలివస్తున్నారు.

కోటిలింగాల క్షేత్రం

కోటిలింగాల క్షేత్రం

వారాంతపు సెలవు రోజులైన శని ఆదివారాలతో పోటీ పడి సోమవారం కూడా అనూహ్యంగా సుమారు 44 లక్షల మంది ప్రజలు పుణ్యస్నానాలు చేశారు. పుష్కరఘాట్లు యథావిధిగా జనంతో కిక్కిరిసి పోగా ఆలయాలు కిటకిటలాడాయి.

సినీ నటుడు కృష్ణుడు

సినీ నటుడు కృష్ణుడు

పోచంపాడు వద్ద పుష్కర స్నానమాచరించిన సినీ నటుడు కృష్ణుడు.

వేణు మాధవ్

వేణు మాధవ్

ఈ సందర్భంగా నటుడు వేణు మాధవ్ మాట్లాడుతూ.. పుష్కరాల ఏర్పాట్లు చాలా బాగుతున్నాయని చెప్పారు. సిఎం కెసిఆర్.. పుష్కర ఏర్పాట్లను అద్భుతంగా చేశారని ప్రశంసించారు.

జోగు రామన్న

జోగు రామన్న


ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం 8 లక్షల మంది స్నానాలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఒక్క బాసరలోనే 3 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

జోగు రామన్న

జోగు రామన్న

జిల్లాలోని పలు ఘాట్లను మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. బాసరలో కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ తరుణ్‌జోషి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లాలో గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. జిల్లాలోని మొత్తం 18 ఘాట్లలో 9,70,337మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. ఏపీలోని తిరుపతినుంచి కూడా కందకుర్తికి భక్తులు వచ్చి స్నానాలు చేశారు. కందకుర్తిలో 3.25లక్షల మంది స్నానాలు చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకే వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పుష్కర ఘాట్లకు చేరుకుని పుష్కర ఘాట్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా పరిశీలించారు.

ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రుద్రరాజు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, వినాయకుడు ఫేం సినీనటుడు కృష్ణుడు పుణ్యస్నానాలు చేశారు. సావెల్ ఘాట్లో నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ సీడీపీ ఇన్‌చార్జి ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబసభ్యులు స్నానాలు ఆచరించారు. తడపాకల్‌లో 2లక్షలమంది స్నానాలు ఆచరించారు. మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, పోలీస్ అడిషనల్ కమిషనర్(క్రైం) శ్రీనివాస్‌రెడ్డి పుష్కర స్నానాలు చేశారు.

సెలవులు ముగిసినా తగ్గని రద్దీ

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం 8 లక్షల మంది స్నానాలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఒక్క బాసరలోనే 3 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని పలు ఘాట్లను మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. బాసరలో కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ తరుణ్‌జోషి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

English summary
Tollywood actors participated in Godavari Pushkaralu in Telangana on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X