వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి జలాలు చూసే వాళ్లమా? కేసీఆర్‌తోనే ఆ చిరకాల స్వప్పం.. మంత్రి జగదీష్ రెడ్డి ఎమోషనల్

|
Google Oneindia TeluguNews

సూర్యాపేట ప్రజల చిరకాల వాంఛను సీఎం కేసీఆర్ నెరవేర్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం రావిచెరువులో గోదావరి నీళ్లు మత్తడి దూకాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 చిరకాల వాంఛ

చిరకాల వాంఛ

రావిచెరువలో గోదావరి నీళ్లు మత్తడి దూకడంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గోదావరి జలాలు రావడంతో ఊరంతా పండగ వాతావరణం నెలకొందని చెప్పారు. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతోనే కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు వచ్చాయని గుర్తుచేశారు. తమకు జలసిరులు కురిపించిన కేసీఆర్ వెన్నంటే ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు సూచించారు.

ఉద్యమ సమయంలో బీజం..

ఉద్యమ సమయంలో బీజం..

నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు మళ్లించాలని ఉద్యమ సమయంలోనే డిమాండ్ వచ్చింది. లిప్ట్ ద్వారా పెన్ పహాడ్ మండలాని పారించాలని రైతుల కోరినా.. గోదావరి జలాలతోనే సస్యశ్యామలం అవుతుందని చెప్పినా విషయాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు.

కాళేశ్వరంతోనే..

కాళేశ్వరంతోనే..

కొందరు ఇంజినీర్లు కూడా రావిచెరువు నీరు తరలించే అంశంపై ప్రతిపాదనలు తీసుకొచ్చారని చెప్పారు. కానీ తాను అందుకు అంగీకరించలేదని.. కాళేశ్వరం ప్రాజెక్టు పూరితో గోదావరి జలాలు పరుగు తీస్తాయనే ఆనాడే చెప్పిన అంశాన్ని నెమరేసుకున్నారు.

వెలుగు జిలుగులు

వెలుగు జిలుగులు

గతేడాది దీపావళి రోజు చిన్న గారకుంటలో పండగ సమయంలో వచ్చే దీపావళి నాటికి నీరు వస్తోందని చెప్పానని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. తాను అంచనా వేసినట్టు నీరు రావడం, ఇంజినీర్ల ప్రతిభ.. సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో పెన్ పహాడ్ నీరు వచ్చిందని మంత్రి తెలిపారు. రావిచెరువు మత్తడిలో గోదావరి నీరు దూకిందనే సంతోషం రైతుల కళ్లలో కనిపిస్తోందని చెప్పారు. కల నెరవేరినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

English summary
godavari water comes to ravicheruvu, farmers are very happy minister jagadeesh reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X