వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాత్‌రూంలో బంగారు బిస్కెట్లు...!

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ విమానాశ్రయంలో తనీఖీలు జరుగుతున్నాయనే సమాచారంతో ఓ స్మగ్లర్ తాను విదేశాల నుండి తీసుకువచ్చిన బంగారాన్ని ఏకంగా విమానాశ్రయంలోని బాత్రుంలో పడేశాడు. అయితే పక్కా సమాచారంతో ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు తమ స్టైల్‌లో విచారణ చేశారు. దీంతో తాను తెచ్చిన బంగరాన్ని ఎయిర్‌పోర్టులోని బాత్రుంలో పడేసినట్టు అంగీకరించాడు.

gold in airport bathroom...!

అంతర్జాతీయా స్మగ్లర్లను ఎన్ని జిమ్మక్కులు చేసిన శంశాబాద్‌లోని కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం శంషాబాద్ విమానాశ్రంలో రూ. 1.11 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధినం చేసుకున్నారు. షేక్ అబ్దుల్లా అనే ప్రయాణికుడు అక్రమంగా షార్జా నుండి బంగారాన్ని తరలిస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టారు.

అయితే కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారనే సమాచారాన్ని ముందే పసిగట్టిన సాజిద్ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఎయిర్ పోర్టులోని బాత్రూంలో పడేశాడు. అయితే సాజిద్ అక్రమ బంగరాన్ని తరలిస్తున్నాడనే పక్కా సమాచారంతోనే ఆయన్ను ఆదీనంలోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు. దీంతో సాజిద్ అసలు విషయం బయటపెట్టాడు. దీంతో బాత్‌రూంలో ఉన్న సుమారు మూడు కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Customs officials seized 1.11 crore worth of gold at Shamshabad airport on sunday.named Sheikh Abdullah was smuggling gold from Sharjah illegally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X