హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బల్గేరియాలో గోల్డ్ మెడల్: కేటీఆర్‌ను, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నిఖత్ జరీన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లను ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ సోమవారం కలిశారు.

బల్గేరియాలో జరిగిన పోటీల్లో స్ట్రాంజా బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెలిచింది. గోల్డ్ మెడల్ గెలిచిన ఈ తెలంగాణ అమ్మాయి, బాక్సర్ నీఖత్ జరీన్ వీరిరువురిని కలిసింది. తెలంగాణ భవన్‌లో వారిని కలిసింది. ఆమెకు లభించిన బంగారు పతకాన్ని వారు చూశారు.

ఈ సందర్భంగా నిఖత్ జరీన్ పోరాట స్ఫూర్తిని పట్టుదలను కేటీఆర్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నిఖత్ జరీన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా కేటీఆర్‌ను, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిశారు. వారు ఆమెకు అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు.

Gold medalist boxer Nikhat Zareen meets KTR and Minister Srinivas Goud

తెలంగాణ నుంచి బాక్సింగ్‌లో అద్బుతమైన ప్రతిభాపాటవాలతో ఒక యువత కు ఒక ఐకాన్‌గా నిలుస్తోందని ఆమెను అభినందించారు. భవిష్యత్తులోనూ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం తనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తాననే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా తనకు అందిస్తున్న సహకారం పట్ల ఆమె ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు.

English summary
Gold medalist boxer Nikhat Zareen met Telangana Congress working president KT Rama Rao and Minister Srinivas Goud on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X