• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సరే.. మరి అమ్మితే.. కృష్ణా జ్యువెల్లర్స్‌కు అదే ఎఫెక్టా?

|

హైదరాబాద్ : నమ్మినవన్నీ జరుగుతాయా? అసలు నమ్మకమంటే ఏమిటి? ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన ఎవరి తలరాతలు మారవు. అది జగమెరిగిన సత్యం. కానీ నమ్మకమనే ఒక్క ఆయుధం మనుషులను అలా ముందుకు నడిపిస్తుంటుంది. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే మంచిదనే సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది. బంగారం కొంటే కచ్చితంగా మంచే జరుగుతుందని ఎవరైనా ప్రూవ్ చేయగలరా? అదంతా ఏమో గానీ.. ఆ రోజు బంగారం కొంటే మంచే జరుగుతుందని నమ్మితే.. మరి అమ్ముకుంటే ఏం జరుగుతుంది. అది మాత్రం ఎవరూ చెప్పలేరు. అయితే సరిగ్గా అక్షయ తృతీయ నాడే హైదరాబాద్ లో జరిగిన ఘటనతో ఆ రోజు బంగారం అమ్మితే ఇలాగే జరుగుతుందనే కామెంట్లు వినిపించడం గమనార్హం.

ఓట్లు వేస్తూ సెల్ఫీలు.. కేసుల పాలవుతున్న యువకులు.. ఇదేమి పెంటరా నాయనా..!

కొంటే లాభం.. మరి అమ్మితే..!

కొంటే లాభం.. మరి అమ్మితే..!

అక్షయ అంటే తరగనిది అని.. క్షయం లేనిదనే అర్థం వస్తుందంటారు పెద్దలు. ఆరోజు అష్టైశ్వర్యాలకు అధినేత్రిగా భావించి శ్రీమహాలక్ష్మి అమ్మవారిని కొలిచి మొక్కుతారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదని విశ్వసిస్తారు. ఆ క్రమంలోనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు ఆ రోజు ఏ కార్యక్రమం చేసినా.. నశించి పోకుండా ఉంటుందనే నమ్మకం జనాల్లో ఉంది. అందుకే బంగారం తక్కువలో తక్కువ గ్రాము, రెండు గ్రాములు కొన్నా కూడా.. అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అలా క్రమక్రమంగా ఒకరిని చూసి మరొకరు బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.సరే, అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే కలిసివస్తుంది. మరి, అమ్మేటోళ్ల పరిస్థితి ఏంటి. లక్ష్మిదేవి వారి నుంచి వెళ్లిపోతున్నట్లు భావించాలా.. లేదంటే ఏ రకంగా దాన్ని చూడాలి. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కొనేవాళ్లకు లాభమైతే.. మరి అమ్మేవాళ్లకు నష్టం కలుగుతుందా అనేవాళ్లు లేకపోలేదు.

కృష్ణ జ్యువెల్లర్స్ పై దాడి అందుకేనా?

కృష్ణ జ్యువెల్లర్స్ పై దాడి అందుకేనా?

అక్షయ తృతీయ నాడు బంగారం దుకాణాలు కళకళలాడుతాయి. అక్కడున్న బంగారంతో కాదు.. క్యూ కట్టే జనాలతో కిటకిటలాడుతాయి. హైదరాబాద్ లో ఆ ఒక్క రోజే కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుంది. అయితే కృష్ణా జ్యువెల్లర్స్ పై అధికారులు దాడి చేయడం చర్చానీయాంశమైంది. సరిగ్గా అక్షయ తృతీయ నాడే దాడులు జరగడంతో భిన్నరకాల వాదనలు వినిపించాయి.

అదలావుంటే కృష్ణా జ్యువెల్లర్స్ పై జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకుని.. అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలే తప్ప అమ్ముకోవద్దనే కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం గమనార్హం. బంగారం కొంటే అదృష్టమని టీవీల్లో, పత్రికల్లో ఊకదంపుడు పబ్లిసిటీ చేసే జ్యువెల్లర్ షాప్స్ నిర్వాహకులు ఈ మాత్రం తెలుసుకోలేదా అంటూ చురకలు అంటిస్తున్నారు.

ఆధ్యాత్మిక వేత్తల వెర్షన్ ఏంటంటే..!

ఆధ్యాత్మిక వేత్తల వెర్షన్ ఏంటంటే..!

అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుందో లేదో ఏమో గానీ భిన్నరకాల వాదనలు వినిపిస్తుంటాయి. కొందరేమో కొంటే బాగుంటుందంటారు. మరికొందరేమో కొనకపోవడమే బెటరంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనేది వ్యాపారులు క్రియేట్ చేసిన ఓ జిమ్మిక్కు అంటారు ఇంకొందరు.

అయితే ఈ రోజు బంగారం కొంటే పాపం కొన్నట్టేనంటూ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అదలావుంటే చాగంటి వ్యాఖ్యలను కొందరు ఆధ్యాత్మికవేత్తలు సమర్థించడం కొసమెరుపు. కచ్చితంగా బంగారం కొనాలనే నియమమేదీ లేదని చెబుతూనే.. అదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారు. బంగారం అంటే అమితంగా ఇష్టపడే మహిళల

సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారే తప్ప.. కొనేవారికి కలిసొచ్చేదేమీ ఉండదని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Purchase of Gold is luck or not on the day of akshaya tritiya. Many of the people believe that even one gram gold purchase on akshaya tritiya also good for their future. On that day gold purchase ok, what about sale. Many comments rolled over what will be happen if sale the gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more