వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైపైకి పసిడి.. రూ.40 వేలకి చేరువలో 10 గ్రాముల బంగారం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అతివల మదిని దోచే ఆభరణాలు .. స్వర్ణకాంతులే. అందుకే వాటి ధర కూడా ఎక్కువే. 10 గ్రాముల బంగారం ధర రూ.40 వేలకు చేరువలో ఉంది. అసలే శ్రావణ మాసం, మంచిరోజులు ఉండటంతో బంగారం ధర రోజురోజుకి పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే రూ.200 పెరిగింది. త్వరలో 10 గ్రాముల బంగారం రూ.40 వేలకి చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవాళ ఒక్కరోజు బంగారం ధర రూ.200 పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.38,770కి చేరింది. శ్రావణమాసం కావడం .. ఫంక్షన్లు ఉండటంతో కొనుగోలు కూడా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో బంగారం ధర పైపైకి ఎగబాకుతుంది. మరోవైపు ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం లేదని ట్రేడింగ్ వర్గాలు చెప్తున్నాయి. అందుకోసమే బంగారం ధర పెరుగుతుందని వివరిస్తున్నారు.

gold rate is very high

బంగారం ధర పెరుగుతుంటే .. వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,100 తగ్గింది. దీంతో కిలో వెండి రూ.43 వేల 900కి చేరింది. మరోవైపు పసిడి ధర చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. మేం కొనలేం బాబోయ్ అంటున్నారు.

English summary
Gold price increased by Rs 200. Ten grams of gold was costing Rs 38,770. Purchase is the same level as buying functions. This will raise the price of gold. On the other hand, there is no decline in demand from jewelery makers, trading sources say. That is why the price of gold is rising.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X