హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉండేది ఫైవ్‌స్టార్ హోటల్...! చేసేదీ బంగారం స్మగ్లింగ్ ...! పోలీసులకు పట్టుబడిన మహిళ

|
Google Oneindia TeluguNews

వయస్సు 40 సంవత్సరాలు, సరాసరి మహిళల కంటే ఎక్కువగా 6 ఫీట్ల పోడవు ఉంటుంది. దీనికి తోడు ఇంగ్లీష్ బాష అనర్గళంగా మాట్లాడుతోంది. మరోవైపు విదేశాలకు తరచుగా వెళ్లివస్తుంది.ముఖ్యంగా దుబాయ్‌కి ఎక్కువగా వెళ్లి వస్తుంది.ఎక్కడికి వెళతున్నావ్ అంటే విదేశాల్లో అడ్వకేట్‌గా చేస్తున్ననట్టు మస్కకొడుతుంది. మరోవైపు ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటుంది..ఇన్ని చేస్తున్న ఉన్నా తనను ఎందుకు పట్టుకుంటారులే అనుకుందో ఏమే ఓ మహిళ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుపడింది.

ఫైవ్‌స్టార్ హోటల్ వేదికగా బంగారం స్మగ్లింగ్,

ఫైవ్‌స్టార్ హోటల్ వేదికగా బంగారం స్మగ్లింగ్,

హైదరాబాద్‌కు చెందిన నస్రీన్ అనే మహిళ తన భర్త నుండి విడాకులు తీసుకుని కూతురుతో కలిసి జీవిస్తుంది. అమే కొద్ది సంవత్సరాలుగా బంగారం స్మగ్లింగ్ చేసే ముఠాలో పనిచేసింది. దీంతో గత ఆరునెలలుగా స్వంతగానే గోల్గ్ స్ల్మగ్లింగ్ చేస్తోంది.. స్వంతగా చేస్తున్న వ్యాపారం సక్సెస్ కావడంతో వెంటనే తన మకాంను ఇంటి నుండి బంజార హిల్స్‌లోని ఓ ఫైవ్ స్టార్ హొటల్‌కు మార్చింది. గత మూడు నెలలుగా కూతురుతో కలిసి ఫైవ్ స్టార్ హోటల్‌లోనే ఉంటుంది. ఎవ్వరికి అనుమానం రాకుండా హోటల్ నుండే తన స్మగ్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన మహిళ

బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన మహిళ

ఇక ఆమే తన స్మగ్లింగ్ వ్యాపారం కోసం సుమారు నలుగున్నర కోట్ల రుపాయాలు పెట్టుబడిగా పెట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.తరచూ దుబాయ్‌కు వెళ్తూ.. విదేశాల నుండి తీసుకువచ్చిన బంగారాన్ని దేశంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తోంది. దీంతో విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు స్కెచ్ వేసి పట్టుకున్నారు. కాగా నస్రీన్ ఆరు నెలల నుండి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నా... పోలీసులకు పట్టుబడడం ఇదే మొదటిసారని పోలీసులు తెలిపారు.

ప్రత్యేక కేసుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రత్యేక కేసుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇలా ఇప్పటి వరకు 65 మంది స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నప్పటికి వీరిలో నస్రీన్ కేసు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరితో బంగారం కొనుగోలు చేసేవారిని కూడ ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.కాగా బంగారం ఒక్కసారి దిగుమతి అయిన తర్వాత అది అయిదారుగు చేతులు మారుతుందని దీంతో దీన్ని స్మగ్లింగ్ బంగారాన్ని రికవరీ చేయడం కష్టసాధ్యంగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

English summary
tanding at around 6 feet tall, Ziaunnisa Nasreen, who is in her early 40s was running the smuggling racket on her own for more than six months, officials said. A resident of Hyderabad, she was a frequent traveller abroad, especially to Dubai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X