వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు ముఖ్యమంత్రుల కుమారుల‌కు ఇది గోల్డెన్ ఛాన్స్..! ఎందుకో చూడండి..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయం ఒక్కోసారి రంజుగా ఉంటుంది. కొంద‌రికి రాజ‌కీయాల్లో జీవిత కాలం ఎందురు చూసినా ముఖ్య‌మంత్రి అయ్యే యోగం ఉండ‌దు. మ‌రి కొంద‌రికి అదిస్టానాల అండ‌తో చిటుక్కున ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశాలు ఎదురౌతుంటాయి. ఇప్పుడు ముఖ్య‌మంత్రి త‌న‌యుల‌కు ఆ ప‌ద‌వి అలంక‌రించే బంగారు అవ‌కాశం ఊరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే న‌లుగురిని ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌రించేందుకు సై అంటోంది. మ‌రి ఎంత మంది ముఖ్య‌మంత్రి త‌న‌యులు ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)

దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పే ద‌క్ష‌త‌..! కాని త‌న‌యుల‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌లేని ప‌రిస్థితి..!

దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పే ద‌క్ష‌త‌..! కాని త‌న‌యుల‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌లేని ప‌రిస్థితి..!

దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల స‌మ‌ర్థ‌త తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఉంది. గ‌త చ‌రిత్ర తిర‌గేస్తే ఎంతో మంది తెలుగు ముఖ్య‌మంత్రుల పేర్లు వినిపిస్తుంటాయి. ఇంత‌టి స‌మ‌ర్థులు కాబ‌ట్టే, జాతీయ పార్టీలు కూడా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ‌ప్ర‌దేశ్‌ల‌తో మైత్రీ బంధానికి వెంప‌ర్లాడుతుంటాయి. ఇంత‌టి ప్ర‌తిష్ఠ‌ను భుజాన‌కెత్తుకున్న తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క‌టి మాత్రం తీర‌ని ముచ్చ‌ట‌గానే మిగిలిపోతోంది. ఇప్ప‌టిత‌రంలో అయినా ఆ ముచ్చ‌ట తీరుతుందా లేదా అనే ప్ర‌శ్న‌ను కాలం లేవ‌నెత్తింద‌నే చెప్పాలి. ఆ అవ‌కాశం ఊరిస్తున్నా దాన్ని అందుకునే యువ‌నేత‌లు ఎంత మంద‌న్న‌ది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

ముఖ్య మంత్రి త‌న‌యుల‌ను ఊరించిన ప‌ద‌వి..! కాని పీఠం అదిష్టించ‌లేని వైనం..!!

ముఖ్య మంత్రి త‌న‌యుల‌ను ఊరించిన ప‌ద‌వి..! కాని పీఠం అదిష్టించ‌లేని వైనం..!!

1952 తొలి ఎన్నికల నాటి నుంచి నిన్న‌టి 2018 ఎన్నిక‌ల వ‌ర‌కూ తెలుగు రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్య‌మంత్రులు మారారు. కొత్త‌, పాత వార‌సులు ఎంద‌రో ఉన్నారు. కానీ ఏపీలో ముఖ్య‌మంత్రులుగా చేసిన నాయ‌కులు త‌న‌యులు మాత్రం ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోలేక‌పోయారు. ఇప్పుడు న‌లుగురు వార‌సుల‌కు ఆ అవ‌కాశం ద‌గ్గ‌ర‌లో ఉంది. పీఠం ఎక్కేందుకు అవ‌కాశాలున్నాయి. వారిలో ముందువ‌రుసలో తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌. వైఎస్ కుమారుడు వైఎస్‌జ‌గ‌న్‌, ఎన్‌టీఆర్ న‌ట‌, రాజ‌కీయ వార‌సుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఏపీ సీఎం త‌న‌యుడు లోకేష్‌. అయితే ముందువ‌రుస‌లో మాత్రం కేటీఆర్ పేరు వినిపిస్తుంది.

కుమారుల ముఖ్య‌మంత్రి ప‌ద‌వి రేసులో ముందున్న కేటీఆర్..! క‌ల ఎప్పుడు నెర‌వేర‌నుంది..?

కుమారుల ముఖ్య‌మంత్రి ప‌ద‌వి రేసులో ముందున్న కేటీఆర్..! క‌ల ఎప్పుడు నెర‌వేర‌నుంది..?

రెండోసారి సీఎం అయిన కేసీఆర్ ఫెడ‌ర‌ల్‌ఫ్రంట్ పేరిట ఢిల్లీకు వెళ‌తాన‌నే అభిప్రాయం వెలిబుచ్చారు. ఇటువంటి స‌మ‌యంలో టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మ‌రో నాలుగైదు నెల‌ల్లో ఎన్నిక‌లు వ‌స్తే.. అప్పుడు దేశం మొత్తం చుట్టొచ్చేందుకు రెడీ అవుతున్నారు. కాబ‌ట్టి కేటీఆర్ సీఎం త‌న‌యుడుగా తొలి సారి సీఎం పీఠం అధిరోహిస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగ‌తుంది. బాల‌య్య‌కు అవ‌కాశం ఉన్నా టీడీపీ నుంచి చంద్ర‌బాబు, లోకేష్ ఎంత వ‌ర‌కు బాల‌య్య‌కు అవ‌కాశం ఇస్తార‌నేది ప్ర‌శ్నార్ధ‌కం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు కూడా జాతీయ రాజ‌కీయాల్లోకి దూక‌బోతున్నారు. కాబ‌ట్టి.. లోకేష్‌కే పార్టీ, రాష్ట్ర ప‌గ్గాలు అప్ప‌గించ‌వ‌చ్చ‌నే ఊహాగానాలున్నాయి.

ఏపి నుంచి రేసులో లోకేష్, జ‌గ‌న్..! ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకుంటారా..?

ఏపి నుంచి రేసులో లోకేష్, జ‌గ‌న్..! ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకుంటారా..?

ఇక మిగిలింది వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి త‌న‌యుడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి. తెలంగాణ‌లో కేసీఆర్ రెండో సారి సీఎం పీఠం అదిరోహించ‌డంతో ఏపీలో జ‌గ‌న్‌పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ప‌వ‌న్ నుంచి పోటీ ఉన్నా అది కేవ‌లం 20-30 సీట్ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌చ్చ‌నే ధీమా కూడా జ‌గ‌న్ పార్టీలో ఉంది. ఎలాగైనా 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకురావ‌టం ద్వారా తండ్రి వైఎస్ వార‌సుడిగా సీఎం సీటులో కూర్చునేందుకు ఛాన్సుంది. అయితే న‌లుగురు వార‌సుల్లో సీఎంగా మారిన త‌న‌యుల్లో ఎవ‌రు మొద‌ట‌గా నిల‌బ‌డ‌తార‌నేది ఇప్ప‌టికైతే ఉత్కంఠ‌ను రేపుతోంది.

English summary
Some people do not have the right to be a chief minister in politics. For some, it is likely to be the chief minister due to the high command recommendations. Now the chief minister has a golden opportunity to decorate that position. In the Telugu states, four are in the race to become Chief Minister. And how many Chief Minister sons take advantage of that opportunity
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X