వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది నుంచే నిరుద్యోగ భృతి? బడ్జెట్ ఎంతో తెలుసా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎన్నికల మేనిఫెస్టో అమలుకు తెలంగాణ సర్కార్ సన్నద్ధమవుతోందా? వివిధ పథకాలపై ప్రకటించిన హామీల్లో దేనికి మొదటగా ప్రాధాన్యం ఇవ్వనుంది? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా అధికారులు చేస్తున్న కసరత్తు సమాధానంగా కనిపిస్తోంది. తొలుత నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

నిరుద్యోగ భృతి ఎలా అమలు చేయాలి? మార్గదర్శకాలు ఏమిటి? లబ్ధిదారులను ఎలా గుర్తించాలి? తదితర అంశాలకు సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఉగాది నుంచే నిరుద్యోగ భృతి అమలుకానుంది. ఒకవేళ కాస్తో కూస్తో ఆలస్యమయితే మాత్రం తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం జూన్ 2 నుంచి నిరుద్యోగ భృతి చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారట.

20 లక్షల మంది.. 500 కోట్లు..!

20 లక్షల మంది.. 500 కోట్లు..!

రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎన్నికల నాటి మేనిఫెస్టో హామీలు, పథకాల అమలుపై సీరియస్ గా దృష్టి సారించింది. ఈక్రమంలో నిరుద్యోగ భృతి అమలుపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. దీనికోసం భారీగా బడ్జెట్ అవసరం కానుండటంతో ఎలా చేయాలనేదానిపై కసరత్తు చేయాలని సూచించారట. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు నమోదైనట్లు అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో దీనికి సంబంధించి నిధులు కేటాయించాల్సిరావడంతో ఆర్థికశాఖ అధికారులు దానికనుగుణంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నిరుద్యోగ భృతి అమలు కావాలంటే కనీసం 500 కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావిస్తున్నారు.

కల్వకుర్తిలో కల్వకుర్తిలో "గులాబీ ముల్లు".. నేతల మధ్య డిష్యుం డిష్యుం.. కేటీఆర్ ఏమంటారో?

విధివిధానాలు.. మార్గదర్శకాలు

విధివిధానాలు.. మార్గదర్శకాలు

నిరుద్యోగ భృతి అమలుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడ్డారట అధికారులు. కేసీఆర్ ఆదేశాలతో విధివిధానాలు, మార్గదర్శకాలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే అర్హులను ఎంపిక చేయడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోబోతున్నారు. నిర్ధిష్టమైన విధానం అమలు చేయడానికి కొంత సమయం పట్టొచ్చనేది అధికారుల మాట. అదలావుంటే ఇతర రాష్ట్రాలు అమలుచేస్తున్న నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి అధ్యయనం చేయడం, లోటుపాట్లు తదితర విషయాలను తెలుసుకొనే ప్రయత్నాలు చేయబోతున్నారట. మొత్తానికి ఉగాదిలోగా నిరుద్యోగ భృతి పథకాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చి అమలు చేయాలనే ఆలోచనైతే కనిపిస్తోంది. ఒకవేళ అప్పటికీ అంతా సవ్యంగా జరిగితే ఓకే.. లేదంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి కచ్చితంగా అమలు చేస్తారని సమాచారం.

అర్హులెవరు.. ఎలా గుర్తిస్తారు?

అర్హులెవరు.. ఎలా గుర్తిస్తారు?

ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి కీలాకాంశంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి నెలకొందనే విషయం గుర్తించారు. దీంతో ఎట్టిపరిస్థితుల్లో ఈ పథకాన్ని జాప్యం చేయొద్దనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే దీనికి మొదటి ప్రాధాన్యం కల్పిస్తూ అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారట.

నిరుద్యోగులుగా నమోదైనవారికి గత ఐదేళ్లలో ఎవరికైనా ఉపాధి లభించిందా తదితర అంశాలు పరిగణనలోకి తీసుకొని అర్హులను ఎంపిక చేసేలా కసరత్తు చేయనున్నారు అధికారులు. 35 సంవత్సరాలు నిండి వివాహం కానివారు.. వివాహమై భార్యభర్తలు నిరుద్యోగులుగా ఉంటే ఒక్కరికే ఇవ్వాలా, లేదంటే ఇద్దరికి ఇవ్వాలా.. ఇంటిలో ముగ్గురు నలుగురుంటే ఏమి చేయాలి.. రైతుబంధు తదితర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాల్లోని నిరుద్యోగులను ఎలా పరిగణించాలి.. తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు.

English summary
The TRS government came to power for the second time. Election manifesto has been focused on implementation of the guarantees and schemes. It seems to have been discussed CM KCR with officials on the implementation of unemployment benefits. Nearly 20 lakh unemployed people are estimated to be registered in the state. It is expected that at least 500 crores will be needed for unemployment benefits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X