వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ ర్యాంకులు: ఐఐటీ-హెచ్ 9, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 5, ఓయు 23వ స్థానంలో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) దేశంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో 9వ ర్యాంక్ సాధించింది. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్స్క్ (ఎన్ఐఆర్ఎఫ్), కేంద్ర మానవవనరుల శాఖ, నిర్వహించిన ర్యాంకింగ్స్‌లో ఐఐటీ-హెచ్ గత ఏడాది కంటే ఓ స్థానం ముందుకు వచ్చింది. గత ఏడాది ఐఐటీ-హెచ్ 10వ స్థానంలో ఉంది.

ఓవరాల్ కేటగిరీలను పరిగణలోకి తీసుకున్నా ఐఐటీ-హెచ్ ర్యాంక్ గత ఏడాది కంటే మెరుగ్గా ఉంది. గత ఏడాది 26వ స్థానంలో ఉండగా ఇప్పుడు 22వ స్థానంలో ఉంది. ఐఐటీ గౌహతి 9వ స్థానంలో ఉంది.

Good show by UoH, IIT-H in national rankings

మరోవైపు, విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ర్యాంకుల్లో 5వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇది 7వ స్థానంలో ఉండగా, ఈసారి రెండు స్థానాలు ఎగబాకింది. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ గత ఏడాది 23వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 28వ స్థానానికి పడిపోయింది. ఓవరాల్‌గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 11వ స్థానంలో, ఐఐఐటీ-హెచ్ 22వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 45వ స్థానంలో, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-వరంగల్ (నిట్) 78వ స్థానంలో ఉన్నాయి.

యూనివర్సిటీలలో తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 82వ స్థానంలో, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ-హైదరాబాద్ 98వ స్థానంలో ఉంది.

దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్్స్ నిలిచింది. ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలగా ఐఐటీ-మద్రాస్, ఉత్తమ నిర్వహణ విద్యా సంస్థగా ఐఐటీ -అహ్మదాబాద్‌లు ఉన్నాయి.

2018కి సంబంధించి దేశంలోని 4వేల విద్యా సంస్థలకు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్స్ ర్యాంకులు ఇచ్చింది. వీటిని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాది కొత్తగా వైద్య, దంత వైద్య, శిల్పకళా కళాశాలలకు ర్యాంకులు ప్రకటించారు. గత ఏడాది 3వేల విద్యా సంస్థలు పోటీపడగా, ఈసారి ఆ సంఖ్య నాలుగు వేలకు చేరింది.

English summary
The Indian Institute of Technology, Hyderabad (IIT-H) has been ranked No. 9 among all engineering institutes as per the India Rankings 2018 conducted by the National Institutional Ranking Framework (NIRF), Ministry of Human Resource Development, Government of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X