వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటోల తారుమారు: ఎమ్మెల్సీ ఎన్నికల రద్దు, తిరిగి 19న

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దయింది. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంతో కేంద్ర.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దయింది. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ గురువారం సాయంత్రం ప్రకటించారు.

తిరిగి మార్చి 19న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్‌లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నివేదిక పంపాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు

Goof-up leads to cancellation of MLC poll in one Telangana constitutency

వివరాల్లోకి వెళితే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన బ్యాలెట్‌ పత్రంలో అభ్యర్థులు మాణిక్యరెడ్డి, ఆదిలక్ష్మయ్య ఫొటోలు తారుమారయ్యాయి. మొదటి నుంచి మూడో పేరు మాణిక్యరెడ్డిది కాగా తొమ్మిదో పేరు ఆదిలక్ష్మయ్యది. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగు ప్రారంభమైన కొద్దిసేపటికి ఫొటోల తారుమారు వ్యవహారం బయటకొచ్చింది. అభ్యర్థి మాణిక్యరెడ్డి తన వర్గీయులను అప్రమత్తం చేసి పోలింగ్‌ కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించారు.

పోలింగ్‌ను రద్దు చేసి మరో దఫా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ లేఖ ఇచ్చారు. ఇదే విధంగా పలువురు అభ్యర్థులు సచివాలంయలో ఎన్నికల ముఖ్య అధికారికి వినతిపత్రాలు అందజేశారు. వేర్వేరు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ అద్వైత్‌కుమార్‌ తప్పు జరిగినట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందచేశారు.

రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి వర్తమానం పంపారు. అక్కడి నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవటంతో పొలింగ్‌ను యథావిధిగా కొనసాగించారు. సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఫొటోల తారుమారు వ్యవహారంపై ఉన్నతాధికారితో విచారణకు ఆదేశాలిచ్చింది. బాధ్యులు ఎవరో కూడా నిర్ధారించాల్సిందిగా స్పస్టం చేసింది.

మార్చి 19న తిరిగి పోలింగ్‌ నిర్వహించనున్న దృష్ట్యా ఆలోగా విచారణను పూర్తి చేసి పంపాలని స్పష్టం చేసింది. విచారణాధికారిని గుర్తించే పనిలో ఎన్నికల అధికారులున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది పోటీలో ఉన్నారు. బ్యాలెట్‌ పత్రాన్ని రూపొందించిన అధికారులు తొలి నమూనాను ఎన్నికల సంఘం అధికారులకు పంపారు. అభ్యర్థుల పేర్లల్లో కొన్ని అక్షర దోషాలు ఉన్నట్లు వారు గుర్తించారు. వాటిని సరిచేసేందుకు నిర్ణయించారు. ఆ సమయంలో ఫొటోలు సక్రమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అక్షర దోషాలను సరిచేసే క్రమంలో ఫొటోలు మారాయి. గుర్తించిన అక్షర దోషాలను సరిచేశారా? లేదా? అన్నది మాత్రమే సరిచూసుకుని సిబ్బంది బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ తర్వాత కూడా అధికారులు సరిచూసుకోలేదు. ఉత్తరప్రదేశ్‌లో మండలికి గతంలో ఎన్నిక జరిగిన సందర్భంగా ఇదే తరహాలో అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావటంతో అక్కడ కూడా ఎన్నికల సంఘం ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించింది.

'ఈ నెల 19న తిరిగి పొలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తాం. బ్యాలెట్‌ పత్రాన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. 23,789 బ్యాలెట్‌ పత్రాలను మళ్లీ ముద్రిస్తాం. ప్రస్తుతం ఉన్న పోలింగు కేంద్రాల్లోనే ఎన్నికను నిర్వహిస్తాం. విచారణ నివేదిక అందనిదే ఫొటో ఎలా మారిందన్నది ఇప్పుడే చెప్పటం సాధ్యం కాదు.' అని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు.

ముగ్గురికి తాఖీదులు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్‌ పేపర్‌ తప్పుగా ముద్రితమవడంపై జీహెచ్‌ఎంసీ ముగ్గురు అధికారులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ బ్యాలెట్‌ పేపర్లకు బాధ్యులుగా ఉన్న అదనపు కమిషనర్‌ జి.రమేష్‌, ఎస్టేట్‌ అధికారి సూర్యకుమార్‌, అదనపు ఎస్టేట్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డిలకు గురువారం రాత్రి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి ఛార్జి మెమో జారీ చేశారు. ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలన్నారు.

19న ఇంటర్‌ పరీక్షలు యథాతథం

రాష్ట్రంలో మార్చి 19న షెడ్యూలైన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం గణితం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలంగాణ ఇంటర్‌ బోర్డు సృష్టం చేసింది. వాస్తవానికి వాటిని ఈనెల 9నే నిర్వహించాల్సి ఉండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల ఆదివారమైనా 19న నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు గతంలో ప్రకటించింది.

అయితే, గురువారం జరిగిన పోలింగ్‌ను తాజాగా రద్దుచేసి, మళ్లీ 19న జరుపుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 19న జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడతాయని ప్రచారం జరగడంతో, ఇంటర్‌ బోర్డు సృష్టత ఇచ్చింది.

English summary
Election to Mahbubnagar-Rangareddy-Hyderabad Teachers’ constituency Legislative Council, which was held on Thursday, has been cancelled because of a goof-up in printing of photographs of candidates on the ballot paper. The Election Commission of India (ECI) ordered re-election for MLC seat on March 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X