వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోషామ‌హ‌ల్ చంద్ర‌ముఖి అందుకే అద్రుశ్యం అయ్యిందా..? పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు అవేనా..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :గోషామహల్ చంద్రముఖి అద్రుశ్యం ఘటన రోజుకో మలుపుతిరుగుతోంది. పోలీసులకు సవాల్ గా మారిన ఈ సంఘటన ఇంతవరకూ కొలిక్కి రాలేదు. అసలు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుండి పోటీలో ఉన్న చంద్రముఖి అకస్మాత్తుగా అద్రుశ్యం అవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇంతకీ ఆమెను ఎవరైనా అపహరించారా లేక ఆమే ప్రచారంకోసం వెళ్లి పోయిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రముఖి తప్పిపోయిన దగ్గదర నుండి ఎటు వెళ్లి ఉంటుంది అనే అంశం పై పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. సీసీ కెమారాలు పరిశీలించిన పోలీసులకు షాక్ అయ్యే ద్రుశ్యాలు కనిపించినట్టు సమాచారం.

 కలకలం రేపుతున్న చంద్రముఖి అద్రుశ్యం.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

కలకలం రేపుతున్న చంద్రముఖి అద్రుశ్యం.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

తెలంగాణ ముందస్తు ఎన్నికలు రోజురోజుకూ రంజుగా మారుతున్నాయి. పార్టీలు చేస్తున్న హడావిడితో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అసలైన వ్యవహారాలన్నీ ముగిసిపోవడంతో, ఇక మిగిలిన ఘట్టం కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో ఓ పార్టీ అభ్యర్థి అదృశ్యమయ్యాడంటూ వచ్చిన వార్తలు మరువకు ముందే తెలంగాణలో ఈ తరహా ఘటన మరోటి జరిగింది.

స్వతహాగా వెళ్లిందా.. ఎవరైనా తీసుకెళ్లారా..ఆరా తీస్తున్న పోలీసులు..

స్వతహాగా వెళ్లిందా.. ఎవరైనా తీసుకెళ్లారా..ఆరా తీస్తున్న పోలీసులు..

బీజేపీ సిట్టింగ్ స్థానమైన గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి ట్రాన్స్‌జెండర్‌ చంద్రముఖి అదృశ్యమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 2 సమీపంలోని ఇందిరానగర్‌లో చంద్రముఖి నివసించే ప్రాంతానికి ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు స్థానికంగా ఉంటున్న కొందరు హిజ్రాలు గుర్తించారు. తర్వాత 8 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికెళ్లి చూడగా చంద్రముఖి కనిపించలేదని, ఫోన్లోనూ అందుబాటులో లేదని సహచరులు చెబుతున్నారు. ఎంత ప్రయత్నించినా జాడ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ట్రాంన్స్ జెండర్.. సంచలనంగా మారిన చంద్రముఖి..

అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ట్రాంన్స్ జెండర్.. సంచలనంగా మారిన చంద్రముఖి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ చంద్రముఖినే. ఆమె టికెట్ కోసం ఎన్నో పార్టీల సంప్రదించినా అవకాశం దక్కలేదు. దీంతో ఆమెకు సీపీఎం నేతృత్వంలోని బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చింది. 32 ఏళ్ల ట్రాన్స్ జెండర్ చంద్రముఖి, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్‌తో పాటు, బీజేపీ నేత టీ.రాజాసింగ్‌పై పోటీ చేస్తోంది. నామినేషన్ వేసిన సమయంలో ఆమె చాలా ఉద్వేగంగా మాట్లాడారు. అయితే, ఆమె గోషామహల్ నియోజకవర్గాన్నే ఎంచుకోడానికి మాత్రం విచిత్రమైన సమాధానం చెప్పారు.

 సొంతంగా వెళ్లినట్టు సీసీ కెమారాల్లో రికార్డు.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..

సొంతంగా వెళ్లినట్టు సీసీ కెమారాల్లో రికార్డు.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..

ఈ నియోజకవర్గంలో వ్యాపారవేత్తలు ఎక్కువ ఉన్నారని, ఉత్తర భారత దేశం నుంచి వచ్చినవాళ్లు చాలా మంది ఉన్నారని, వాళ్లకు ట్రాన్స్‌జెండర్ల సమస్యలు తెలుసని ఆమె అన్నారు. ఒకవేళ తాను ఎంపికైతే, బాల కార్మికుల సమస్య‌ను పరిష్కారిస్తానని చెప్పింది. ఇక్కడ ఆ సమస్య ఎక్కువగా ఉందన్నారు. పురుషుడిగా పుట్టిన చంద్ర‌ముఖి 15 ఏళ్ల క్రితం సెక్స్ మార్పిడి చికిత్స చేయించుకున్న‌ది. అప్ప‌టి నుంచి ఆమె ట్రాన్స్‌జెండ‌ర్ల‌తోనే జీవితాన్ని గ‌డుపుతున్న‌ది. ఎన్నో రోజులుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ట్రాన్స్‌జెండ‌ర్ల‌ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఐతే అకస్మాత్తుగా ఆమె అద్రుశ్యం అవ్వడం, తాను ఎక్కడ ఉందో ఎక్కడకు వెళ్లిందో ఇంతవరకూ తెలియక పోవడం, ఈలోపే కోర్టు లో ప్రవేశ పెట్టాలని పోలీసులకు ఆదేశాలు రావడంతో మరింత ఒత్తిడికి తెలంగాణ పోలీసులు గురైనట్టు తెలుస్తోంది. ముఖానికి చున్ని చుట్టుకుని తాను స్వయంగా వెళ్తున్నట్టు సీసీ కెమారాల్లో రికార్డైన ద్రుశ్యాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ ద్రుశ్యాల ఆధారంగా పోలిసులు దర్యాప్తును వేగవంతం చేైసినట్టు తెలుస్తోంది.

English summary
Goshamahal Chandramukhi is the turning point of the telangana pre ellections.. The incident which turned out to be a challenge to the police. Chandramukhi the contested mla from from Goshamahal kidnapped. the incident suddenly becoming a sensation in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X