వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సిట్ ' చేతిలో నయిం సన్నిహితుల 'చిట్టా',త్వరలో చర్యలు

అసెంబ్లీ సమావేశాల తర్వాత గ్యాంగ్ స్టర్ నయింతో కలిసి సెటిల్ మెంట్లునిర్వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.అయితే ఈ మేరకు ప్రభుత్వం కూడ పోలీసుశాఖ ఉన్నతాధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :గ్యాంగ్ స్టర్ నయింతో సంబంధాలు ఉన్న పోలీసు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఈ మేరకుప్రభుత్వం కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత గ్యాంగ్ స్టర్ నయింతో సంబంధాలున్న అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.గ్యాంగ్ స్టర్ నయిం వ్యవహరాన్ని తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంటుందని సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల తర్వాత పోలీసులపై కూడ చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

గ్యాంగ్ స్టర్ నయిం తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ సెటిల్ మెంట్లు నిర్వహించాడు. అయితే గత ఏడాది మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ నయిం చనిపోయాడు.

పోలీసు అధికారులు నయింకు సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. కొంత మంది అధికారులతో నయిం నిత్యం టచ్ లో ఉండేవాడని సిట్ దర్యాప్తులో తేలింది. అయితే సిట్ ఇప్పటివరకు కొందరిని ప్రశ్నించింది.

అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై ఆధారాలనే సిట్ సేకరించింది. మరికొందరిపై వేటు వేసిన తర్వాతే విచారణ చేయాలని సిట్ భావిస్తోంది. ఈ మేరకు సిట్ ఏర్పాట్లు చేస్తోంది.

 నయింతో సన్నిహితంగా ఉన్న పోలీసులపై చర్యలు

నయింతో సన్నిహితంగా ఉన్న పోలీసులపై చర్యలు

నయింతో సన్నిహితంగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఇప్పటికే కొందరు ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నాయకుల పేర్లు సిట్ దర్యాప్తులో వెలుగుచూశాయి.అయితే ఇప్పటికే కొందరిని సిట్ విచారించింది. అయితే నయింతో ఎక్కువగా పోలీసు అధికారులు సన్నిహితంగా ఉండేవారని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగానే కొందరిని సిట్ ఇప్పటికే విచారించింది.ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు సర్కార్ కూడ సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. దరిమిలా అసెంబ్లీ సమావేశాల తర్వాత నయింతో సన్నిహితంగా మెలిగిన అధికారులపై చర్యలు తీసుకొనే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

 సస్పెన్షన్ తర్వాతే విచారణ

సస్పెన్షన్ తర్వాతే విచారణ

ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై తొలుత సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. సస్పెన్షన్ వేటు వేసిన తర్వాతే వారిని సిట్ విచారించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కూడ శాంతి భద్రతల పట్ల కఠినంగా ఉన్నామనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకుగాను ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టు తెలుస్తోంది.నాలుగు మాసాలుగు సిట్ అధికారులు దర్యాప్తులో సేకరించిన విచారణకు కూడ సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పోలీసు శాఖ అధికారులు కొందరు చెబుతున్నారు.సిట్ దర్యాప్తులో ఆధారాలు లభించిన అధికారులపై తొలుత వేటు వేస్తారు. ఆ తర్వాతే విచారణ చేయనున్నారు.

ఇరవై మందికి పైగా అధికారులకు ఇబ్బందులు

ఇరవై మందికి పైగా అధికారులకు ఇబ్బందులు

ఇరవై మందికి పైగా అధికారులకు ఇబ్బందులు
గ్యాంగ్ స్టర్ నయింతో పోలీసుశాఖలో క్షేత్రస్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. ముగ్గురు అదనపు ఎస్ పిలు, ఆరుగురు డిఎస్ పిలు, తొమ్మిది మంది సిఐలు, ఆరుగురు ఎస్ ఐలు నయింతో సంబంధాలు ఉండేవని సిట్ దర్యాప్తులో తేలినట్టు తెలిసింది.అయితే ఇప్పటికే నయింతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్న కొందరిని విచారించింది సిట్.

 సంబంధాలుంటే చర్యలు తప్పవు

సంబంధాలుంటే చర్యలు తప్పవు

నయింతో సంబంధాలున్నట్టు రుజువైతే అధికారులపై చర్యలు తీసుకోనే అవకాశం ఉంది. అయితే ఆదారాలను సిట్ సేకరించే పనిలో ఉంది. ఇప్పటికే దాదాపుగా ఆధారాల సేకరణ పూర్తైందని అధికారులు చెబుతున్నారు. పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎవరెవరూ నయింతో మాట్లాడారో ఆ వివరాలన్నీ ఆడియో టేపుల్లో నిక్షిప్తమై ఉన్నాయి.వీటి ఆధారంగా చర్యలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. ఆధారాలు దొరికిన వారిపై కేసులు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 సెటిల్ మెంట్లు చేసినవారిపై చర్యలు

సెటిల్ మెంట్లు చేసినవారిపై చర్యలు

నయింతో కలిసి సెటిల్ మెంట్లు చేసిన ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాతే వారిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే నయింతో ఎవరెవరు సంబంధాలను కలిగి ఉన్నారనే విషయమై సిట్ లోతుగా ఆధారాలను సేకరిస్తోంది. ఈ ఆధారాలను ఆసరాగానే చేసుకొని కేసులను నమోదుచేయనున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై చర్యలు తీసుకోనున్నారు.

English summary
after assembly sessions governament will take action against police officers who participate in settlements with nayeem,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X