వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈద్ ముబారక్ : గవర్నర్ ఇప్తార్ విందుకు కేసీఆర్, జగన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాజ్ భవన్ లో అరుదైన దృశ్యం అవిష్కృమైంది. రంజాన్ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇప్తార్ విందు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ విందుకు హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు, వైసీపీ నేతలు, ముస్లిం ప్రముఖులు విందులో పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు ..
రాజ్ భవన్ సాంస్కృతిక మందిరంలో నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం మత పెద్దలు కూడా పాల్గొన్నారు. జగన్, కేసీఆర్ ఒకరికొకరు స్వీటు తినిపించుకున్నారు. తర్వాత మంత్రులు, నేతలు ఒకరికొకరు స్వీటు తినిపించుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు గవర్నర్ నరసింహన్ సహా .. కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు చెప్పారు.

governer ifftar dinner .. kcr, jagan attend

ఇఫ్తార విందులో తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇఫ్తార్‌ విందు సందర్భంగా రాజ్‌భవన్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రముఖుల రాకతో రాజ్‌భవన్‌ సందడిగా మారింది.

కీలక భేటీ ..
అంతకముందు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విభజన చట్టంలోని కొన్ని అంశాలపై వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని అంశాలతో పాటు హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు అప్పగింత, ఉమ్మడి రాజధానిలోని సంస్థల ఆస్తులు, ఉద్యోగుల విభజన తదితర సమస్యలపై చర్చకొచ్చింది.

సమస్యలన్నింటినీ సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్న నేపథ్యంలో గవర్నర్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన అంశాలపై ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, తదుపరి వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

English summary
On the occasion of Ramzan, Governor Narasimhan Iftar gave a feast. Telugu state chiefs KCR, jagan attended. Telangana ministers, YCP leaders and Muslims participated in the dinner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X