హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

28న మియాపూర్‌లో మెట్రో ప్రారంభం: ప్రధాని ప్రయాణం స్వల్పమే!

నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రధాని మోడీ హైదరాబాద్‌ మెట్రోరైలులో పరిమిత దూరం మాత్రమే ప్రయాణించనున్నట్లు తెలిసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రధాని మోడీ హైదరాబాద్‌ మెట్రోరైలులో పరిమిత దూరం మాత్రమే ప్రయాణించనున్నట్లు తెలిసింది.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టైన హైదరాబాద్‌ మెట్రోరైలు 30 కిలోమీటర్ల మార్గానికి ప్రధాని మోడీ మియాపూర్‌ స్టేషన్‌ వద్ద పచ్చజెండా ఊపనున్నారు.

మియాపూర్ వద్ద ఘనంగా..

మియాపూర్ వద్ద ఘనంగా..

నవంబర్ 28న ప్రపంచ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌ వస్తున్న ప్రధానిని మెట్రో ప్రారంభించడానికి సమయం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే. సమయం ఇస్తారనే ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం మియాపూర్‌ వద్ద ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

మోడీ చేతుల మీదుగా మెట్రో సస్పెన్స్: అమీర్‌పేట స్టేషన్ అదుర్స్, విమానస్థాయి వసతులు ఇవీ.. మోడీ చేతుల మీదుగా మెట్రో సస్పెన్స్: అమీర్‌పేట స్టేషన్ అదుర్స్, విమానస్థాయి వసతులు ఇవీ..

ఆ వెంటనే ప్రధాని అంగీకారం

ఆ వెంటనే ప్రధాని అంగీకారం

గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి డీఎస్‌ మిశ్రా ప్రారంభోత్సవ వేదిక వద్ద ఏర్పాట్లను కొద్దిరోజుల క్రితం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ చర్చించారు. ప్రారంభోత్సవానికి సాంకేతిక అనుమతులన్నీ రాగానే ప్రధాని తన అంగీకారం తెలిపే అవకాశముందని హైదరాబాద్‌ మెట్రోవర్గాలు చెబుతున్నాయి.

మన మెట్రోదే ఆ రికార్డు: టికెట్ ధరపై కేటీఆర్, అటు టెస్టులు, ఇటు స్పీడ్(పిక్చర్స్) మన మెట్రోదే ఆ రికార్డు: టికెట్ ధరపై కేటీఆర్, అటు టెస్టులు, ఇటు స్పీడ్(పిక్చర్స్)

పైలాన్ ఆవిష్కరణ.. ప్రయాణం స్వల్పమే..

పైలాన్ ఆవిష్కరణ.. ప్రయాణం స్వల్పమే..

కాగా, ప్రారంభానికి నాలుగైదు రోజుల ముందే ఇది తెలుస్తుందని చెబుతున్నారు. ప్రధాని ఆ రోజు మియాపూర్‌లో ప్రారంభోత్సవ ప్లాజాలో పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం మెట్రోరైలు రిబ్బన్‌ కత్తిరించి చాలా తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తారని సమాచారం. మెట్రోను నవంబర్ 28న ప్రధాని మోడీ ప్రారంభిస్తారని ఆశిస్తున్నట్లు ఇప్పటికే మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.

ప్రధాని ప్రయాణం.. మియాపూర్-కేబీహెచ్‌బీ

ప్రధాని ప్రయాణం.. మియాపూర్-కేబీహెచ్‌బీ

మియాపూర్‌ స్టేషన్‌లో ఎక్కి జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ వరకే ప్రయాణిస్తారని తెలిసింది. సమయభావంతో పాటూ భద్రతా కారణాల రీత్యా పరిమిత దూరం వరకే ప్రయాణం ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఇప్పటికే గవర్నర్, మంత్రి కేటీఆర్ కూడా పలు మెట్రో స్టేషన్లను పరిశీలించి, మెట్రో రైలులో ప్రయాణించిన విషయం తెలిసిందే.

English summary
As the date for the launch of the first phase of Hyderabad Metro Rail is fast approaching, the State government is waiting for an official communication from the Prime Minister’s Office regarding the inauguration of the prestigious project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X