వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు 60..! 61 కాదా..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపులో సర్కార్ ఆచితూచి అడుగులేస్తోందా? వివాదస్పదం కాకుండా జాగ్రత్త పడుతోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. అయితే 58 ఏళ్ల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామనే హామీకి బ్రేకులేస్తూ.. 60 ఏళ్లకే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

60కే మొగ్గు..!

60కే మొగ్గు..!

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు మరోసారి తెరపైకి వచ్చింది. 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని యోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 2020 ఏప్రిల్ నుంచి అమలు చేయాలనేది సర్కార్ ఆలోచన. అయితే కేంద్ర ప్రభుత్వంను ఫాలో అవుతూ పదవీ విరమణ పెంపు వయసును 60 ఏళ్లకే పరిమితం చేస్తే బాగుంటుందని ఉన్నతాధికారుల మాట. అటు సీఎం కేసీఆర్ అంతరంగం కూడా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం నిర్వహించే తొలి కేబినెట్ సమావేశానికల్లా.. పదవీ విరమణ పెంపు అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

61 లేనట్లేనా..! ఎన్నికల హామీ..?

61 లేనట్లేనా..! ఎన్నికల హామీ..?

58 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయాలనేది ప్రస్తుత నిబంధన. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో 61 సంవత్సరాలు చేస్తామంటూ ప్రకటించింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఎలక్షన్ల సందర్భంగా హామీ ఐతే ఇచ్చింది కానీ.. అమలు చేసే విషయంలో తర్జనభర్జన పడుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 60 ఏళ్లకే మొగ్గు చూపితే లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవనే విషయం ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ 61 సంవత్సరాలు ఫిక్స్ చేయాలనుకుంటే, న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పరిమితం చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

తర్జనభర్జన.. చివరకు 60 ఫిక్సా?

తర్జనభర్జన.. చివరకు 60 ఫిక్సా?

కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులు చెప్పినదానికే జై కొట్టనుంది ప్రభుత్వం. ఆ క్రమంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకే పరిమితం చేయాలని డిసైడ్ చేయనుంది. పదవీ విరమణ 61 ఏళ్లకు పెంచి.. 33 ఏళ్ల సర్వీసు లేదంటే 61 ఏళ్లు, ఏది ముందయితే అది అమలు చేయాలన్న ప్రతిపాదన ఆచరణయోగ్యం కాదనే విషయాన్ని పరిశీలిస్తోంది. 20 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరినవారికి 33 ఏళ్ల సర్వీస్ అంటే 53 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత సమయంలో 60 ఏళ్ల వరకు ఉద్యోగం చేసే అవకాశముంటే.. 20 ఏళ్ల వయసులో జాయిన్ అయినవారు 60 ఏళ్ల డెడ్ లైన్ కాకుండా 7 సంవత్సరాల ముందే పదవీ విరమణ చేయాల్సి వస్తుందన్న విషయాన్ని పరిశీలిస్తోంది ప్రభుత్వం. అలా అన్నీ విషయాలు లెక్కలోకి తీసుకుని 60 ఏళ్లకే ఫిక్స్ కానుంది.

English summary
Once again, the retirement age of government employees came up. Telangana Government thinking that It is good to follow central government's decision which will be limited to 60 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X