వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రారంభోత్సవానికి సర్వం సిద్దం ...

|
Google Oneindia TeluguNews

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈనెల 21న ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం సన్నహాలు చేస్తున్న విషయం తెలిసిందే ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తోపాటు, మహారాష్ట్ర్ర సీఎం ఫడ్నవీస్‌ సైతం ప్రారంభోత్సవానికి రానున్నారు. ఈనేపథ్యంలోనే సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు సిద్దం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.

government officials are getting ready for the Kalleshwaram lift scheme
కాళేశ్వరం ప్రారంభోత్సవానికి అంతా సిద్దం

ఈనేపథ్యంలోనే గోదావరి నుండి 2 టీఎంసీల నీటిని జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవసరమవుతుందని ఆయన తెలిపారు. కాగా ఇంకా కొన్ని లిఫ్టు పనులు జరుగుతున్నాయని చెప్పారు.మరోవైపు ఈ సంవత్సరానికి 4700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండనుందని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని చెప్పారు.

2890 కోట్లతో విద్యుత్ ఏర్పాట్లు

మరోవైపు గోదవరి నుండి మూడు టీఎంసీ నీటీని వచ్చే సంవత్సరం ఎత్తిపోయాలని నిర్ణయించామని అందుకు అదనంగా అవసరమైన 2160 మెగావాట్ల విద్యుత్‌ను కూడ సిద్దం చేశామని చెప్పారు. కాగా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు 7152 మెగావాట్ల విద్యుత్
అందించడానికి ట్రాన్స్‌కో సిద్దంగా ఉన్నామని తెలిపారు.ఇందుకోసం 2890 కోట్ల రుపాయాలను ఖర్చు పెట్టామని ప్రకటించారు.ఇందులో భాగంగానే 15 డెడికేటేడ్ విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మించామని అన్నారు. ఇక గతంలో 30 మెగావాట్ల విద్యుత్ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉందని అన్నారు.

Recommended Video

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు

కోటి ఎకరాలకు నీరందించేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉండాలి.

కోటికిపైగా ఎకరాలకు సాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని అన్నారు.. ప్రాజెక్టుల ద్వారా అనుకున్న విధంగా నీటిని ఎత్తిపోసే బాధ్యత విద్యుత్ ఉద్యోగులపై ఉందని గుర్తు చేశారు. నిర్ణయించిన గడువులోగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసిన స్ఫూర్తితోనే లిఫ్టులను కూడ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి విద్యుత్ ఉద్యోగులు సమర్థతను చాటుకోవాలని ఆయన సూచించారు.

English summary
The Telangana government is preparing for the Kalleshwaram lift scheme on the 21st of this month Andhra Pradesh CM Jagan and the Maharashrta CM Fadnavis are also invited to the opening ceremony. Accordingly, government officials are getting ready,All the rrangements are made by Transco CMD Prabhakar Rao said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X