కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లంచం, లంచం, లంచం.. గవర్నమెంట్ స్కూల్‌లో "టీసీ" ఇవ్వడానికి కూడా లంచమేనా?

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి : ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలలను కాదని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడులకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. చాలాచోట్ల గవర్నమెంట్ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. నాణ్యమైన విద్య ప్రైవేట్ స్కూళ్లల్లోనే కాదు ప్రభుత్వ పాఠశాలల్లోనూ దొరుకుతుందనడానికి పదో తరగతి ఫలితాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అలాంటి క్రమంలో ఓ గవర్నమెంట్ స్కూల్ హెడ్‌మాస్టర్ లంచం తీసుకోవడం చర్చానీయాంశమైంది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ రామగిరి మండలంలోని బేగంపేట్ హైస్కూల్‌పై ఏసీబీ అధికారులు దాడి చేయడం హాట్ టాపికయింది. అక్కడి ప్రధానోపాధ్యాయురాలు దుండిగ లలిత రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ప్రభుత్వ పాఠశాలలో లంచం ఏంటి.. ఎందుకు తీసుకుంటారు అనే సవాలక్ష అనుమానాలు రావొచ్చు. కానీ ఆ మేడమ్ గారి తీరు చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

తెలంగాణ జలీల్ ఖాన్.. బీకామ్ ఫిజిక్స్‌ను తలదన్నిన రాజకీయ వారసుడు..!తెలంగాణ జలీల్ ఖాన్.. బీకామ్ ఫిజిక్స్‌ను తలదన్నిన రాజకీయ వారసుడు..!

government school headmaster bribe for transfer certificate

సుద్దాల రఘు అనే విద్యార్థి బేగంపేట్ గవర్నమెంట్ హైస్కూల్‌లో చదువుకుంటున్నాడు. అయితే ఇతర స్కూలుకు మారుద్దామనే ఉద్దేశంతో ఆ పిల్లోడి తండ్రి హెడ్‌మాస్టర్ లలితను కలిశారు. అయితే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇవ్వడానికి వీలుకాదని చెప్పారు. అదేంటని అడిగితే ఇంకో తీరుగా మాట్లాడారు.

మీ బాబుకు టీసీ ఇవ్వాలంటే కొంత ఖర్చు అవుతుందని మనసులో మాట బయటపట్టారు. అలా రఘు తండ్రి నుంచి రెండు వేల లంచం డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూల్లో లంచం అడగమేంటని షాక్‌కు గురైన సదరు తండ్రి చివరకు చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఆఫీసర్లు హెడ్‌మాస్టర్ లలిత ఆటకట్టించారు. రఘు తండ్రి నుంచి రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

English summary
The attack on the Begumpet High School in the Ramagiri mandal of Manthani Division of Peddapalli district has been a hot topic. The headmaster, Dundiga Lalitha, was caught bribing two thousand rupees. The headmaster demanded a bribe in order to give transfer certificate a student a Suddala Raghu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X