వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త జిల్లాల ఏర్పాటుకు కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తున్న ప్ర‌భుత్వం.! ప్ర‌క్రియ వేగ‌వ‌తం చేయాలన్న సీయం..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబ‌ద్ : తెలంగాణ‌లో జిల్లాల సంఖ్య పెర‌గ‌బోతోంది. ఇప్పుడున్న 31జిల్లాకు అద‌నంగా మ‌రో జిల్లాలు ఏర్ప‌డ‌బోతున్నాయి. ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం, స‌త్వ‌ర అభివ్రుద్ది కోసం చిన్న జిల్లాలు అనుకూలంగా ఉంటాయ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ లో మ‌రో రెండు జిల్లాలు ఆవిర్బ‌వించ‌బోతున్నాయి. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యం త‌ర్వాత తొలిసారి నిర్వ‌హించిన ప‌త్రికా స‌మావేశంలో చంద్ర‌శేఖ‌ర్ రావు కొత్త జిల్లాల ఏర్ప‌టు గురించి స్ప‌ష్ట‌త ఇచ్చారు. దీంతో అదికారులు ఆయా జిల్లాల ఏర్ప‌ట్లు, హ‌ద్దులు, రివెన్యూ మార్గాల ప‌ట్ల నివేదిక‌లు సిద్దం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌లో వేగం పెంచాల‌ని అదికారుల‌కు ముఖ్య‌మంత్రి ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం.

మొద‌లైన కొత్త‌జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌..! తెలంగాణ‌లో 33కు పెర‌గ‌నున్న జిల్లాలు..!!

మొద‌లైన కొత్త‌జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌..! తెలంగాణ‌లో 33కు పెర‌గ‌నున్న జిల్లాలు..!!

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగ‌వంతం చేయాలని సీఎం ఆదేశించారు. ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారిని ఆదేశించారు. వీటితోపాటు కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని ఆయన అదికారుల‌కు సూచించారు.

 జిల్లాలుగా ఆవిర్బ‌వించ‌నున్న ములుగు, నారాయ‌ణ పేట్..! స్పీడ్ పెంచాల‌న్న సీయం..!

జిల్లాలుగా ఆవిర్బ‌వించ‌నున్న ములుగు, నారాయ‌ణ పేట్..! స్పీడ్ పెంచాల‌న్న సీయం..!

తెలంగాణలో ఉన్న జిల్లాల‌కు తోడు మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. నారాయణపేట్, ములుగు కేంద్రంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్ల నుంచి నారాయణపేట్, ములుగు జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. తెలంగాణలో ఇప్పటికే 31 జిల్లాలు ఉన్నాయి. వాటితోపాటూ 69 రెవెన్యూ డివిజన్లు, 585 మండలాలు ఉన్నాయి. కొత్తవాటి రాకతో జిల్లాల సంఖ్య 33కి, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 71కి, మండలాల సంఖ్య 583కి చేరనుంది.

 రెవెన్యూ డివిజ‌న్లు, పరిదిల‌ను సిద్దం చేస్తున్న యంత్రాంగం..! త్వ‌ర‌లో నివేదిక‌..!

రెవెన్యూ డివిజ‌న్లు, పరిదిల‌ను సిద్దం చేస్తున్న యంత్రాంగం..! త్వ‌ర‌లో నివేదిక‌..!

కొత్త జిల్లాల ఏర్పాటు కోసం గుండాల మండలాన్ని జనగాం జిల్లాలో చేర్చారు. ఇప్పుడు ఆ మండలాన్ని జనగాం జిల్లా నుంచీ తప్పించి, యాదాద్రి భువనగిరి జిల్లాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు వీలుగా ప్రతిపాదనలు పంపాలన్న ఆదేశాలు జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, సిద్దిపేట, మహబూబాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్, జగిత్యాల, నాగర్‌కర్నూలు జిల్లాల కలెక్టర్లకు వెళ్లాయి. ములుగు, నారాయణపేటలు ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఉన్నాయి.

కొత్తగా మరిన్ని మండలాలు..! ప‌రిశీలిస్తున్న అదికారులు..!

కొత్తగా మరిన్ని మండలాలు..! ప‌రిశీలిస్తున్న అదికారులు..!

నారాయణపేట జిల్లాలో ప్రస్తుతం ఉన్న నారాయణపేట రెవెన్యూ డివిజన్‌తోపాటు, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్‌లోని కోయిలకొండను చేర్చనున్నారు. ములుగు జిల్లాలో ప్రస్తుతం ములుగు రెవెన్యూ డివిజన్ అలాగే ఉండబోతోంది. నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్, ములుగు మండలంలోని మల్లంపల్లి, బాన్సువాడ నియోజకవర్గంలో చందూరు, మోస్రా, మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఇనుగుర్తి, సిద్దిపేట జిల్లాలో నారాయణరావు పేట, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో మరో మండలం కొత్తగా ఏర్పాటు కానున్నాయి. జనగాం జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు గుండాల మండలాన్ని బదలాయించనున్నారు.

English summary
The number of districts in Telangana is going to grow. In addition to the 31 districts present, another 2 district is going to be formed. Telangana state Chief Minister Chandrashekhar Rao is confident that smaller districts will be suitable for administrative convenience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X