
గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరం; గవర్నర్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని బీజేపీ రాజకీయం: మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగా ప్రస్తుతం రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ కి వెళ్ళిన గవర్నర్ తమిళి సై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్
తమిళి
సై
ఢిల్లీ
టూర్..
అమిత్
షాతో
భేటీ..
ఆ
నివేదికపై
ఉత్కంఠ

గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరం
రాజ్
భవన్లో
రాజకీయాలను
గవర్నర్
తమిళిసై
సౌందరరాజన్
చొప్పించారని
మంత్రి
జగదీష్
రెడ్డి
వ్యాఖ్యానించారు.
గవర్నర్
వ్యవస్థ
గురించి
సీఎం
కేసీఆర్
కు
తెలిసినంతగా
మరెవరికీ
తెలియదు
అని
ఆయన
వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ
పదవుల
పట్ల
తమ
ప్రభుత్వానికి
అపారమైన
గౌరవం
ఉందని
మంత్రి
జగదీష్
రెడ్డి
స్పష్టం
చేశారు.
ప్రధాని
నరేంద్ర
మోడీతో
సమావేశం
తర్వాత
మీడియాతో
మాట్లాడిన
గవర్నర్
తమిళిసై
సౌందరరాజన్
చేసిన
వ్యాఖ్యలు
దురదృష్టకరమని
ఆయన
వ్యాఖ్యానించారు.

గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పంపే ఫైళ్లను ఆలస్యం చేస్తున్నారు
ప్రోటోకాల్
విషయంలో
లోపాలపై
ఎప్పుడు
స్పందించని
గవర్నర్
ఇప్పుడెందుకు
స్పందిస్తున్నారు
అంటూ
మంత్రి
జగదీష్
రెడ్డి
ప్రశ్నించారు.
గవర్నర్
ఎవరి
ఆదేశాల
మేరకు
ఇలా
చేస్తున్నారో
కూడా
తెలియదని
మంత్రి
పేర్కొన్నారు.
రాష్ట్ర
ప్రభుత్వం
పంపిస్తున్న
ఫైల్స్
ను
గవర్నర్
ఉద్దేశపూర్వకంగా
వెనక్కు
పంపుతున్నారని
జగదీష్
రెడ్డి
ఆరోపించారు
.
తెలంగాణ
గవర్నర్
మొదటినుంచి
ఫైళ్లను
కావాలని
ఆలస్యం
చేస్తున్నారంటూ
విరుచుకుపడ్డారు.
మొదట్లో
ఆమెకు
సమయం
తక్కువగా
ఉందని
భావించామని,
కానీ
ఉద్దేశపూర్వకంగానే
ఫైళ్ళను
గవర్నర్
ఆపుతున్నారు
అని
అర్థమవుతుందని
మంత్రి
జగదీష్
రెడ్డి
వెల్లడించారు.

గవర్నర్ పదవిని అడ్డం పెట్టుకొని బీజేపీ నాయకురాలిగా వస్తేనే సమస్య
రాజ్యాంగ
బద్దంగానే
అసెంబ్లీ
బడ్జెట్
సమావేశాలు
నిర్వహించామని,
తమ
వైపు
నుంచి
గవర్నర్
కు
ఎటువంటి
సమస్య
లేదని
ఆయన
పేర్కొన్నారు.
గత
గవర్నర్
నరసింహన్
ఉన్నప్పుడు
రాని
సమస్య
ఇప్పుడు
ఎందుకు
వస్తుందని
ప్రశ్నించారు
మంత్రి
జగదీష్
రెడ్డి.
గవర్నర్
పదవిలో
తమిళిసై
వస్తే
తమకు
ఎటువంటి
అభ్యంతరం
లేదని,
కానీ
గవర్నర్
పదవిని
అడ్డం
పెట్టుకొని
బీజేపీ
నాయకురాలిగా
వస్తే
మాత్రమే
సమస్య
అన్నారు
మంత్రి
జగదీష్
రెడ్డి.
రాష్ట్ర
ప్రభుత్వం
గా
తామెప్పుడూ
గవర్నర్
పై
మాట్లాడలేదని,
ప్రోటోకాల్
అంశంపై
గవర్నర్
కార్యాలయం
నుండి
తమ
సర్కార్
కు
ఎలాంటి
ఫిర్యాదు
అందలేదని
జగదీష్
రెడ్డి
గుర్తు
చేశారు.

గవర్నర్ వ్యాఖ్యలను బట్టి గ్యాప్ వచ్చినట్టుగా అర్ధం అవుతుంది
ముఖ్యమంత్రితో
చర్చల
అవసరం
ఏముంది
అని
ప్రశ్నించిన
ఆయన,
ఏదైనా
సమస్య
ఉంటే
గవర్నర్
సమయం
తీసుకొని
వెళ్తారు
కదా
అంటూ
ప్రశ్నించారు.
గవర్నర్
గా
తనకున్న
బాధ్యతలను
ఆమె
నిర్వహించాల్సిందేనని
పేర్కొన్న
మంత్రి,
సీఎం
కేసీఆర్
తో
ఏవైనా
సమస్యలుంటే
ఆయన
కలిసిన
సమయంలోనే
చెబితే
బాగుండేదని
వ్యాఖ్యానించారు.
కానీ
ఈ
విషయంపై
గవర్నర్
మీడియాతో
మాట్లాడటం
సరైన
పద్ధతి
కాదని
మంత్రి
జగదీష్
రెడ్డి
అభిప్రాయపడ్డారు.
రాజ్
భవన్
కు
ప్రగతి
భవన్
కు
గ్యాప్
వచ్చిందని
తాము
ఏనాడూ
భావించలేదు
అని,
కానీ
గవర్నర్
వ్యాఖ్యలను
బట్టి
గ్యాప్
వచ్చినట్టుగా
అర్థమవుతుందని
మంత్రి
జగదీష్
రెడ్డి
పేర్కొన్నారు.
గవర్నర్
వ్యవస్థను
అడ్డంపెట్టుకుని
బిజెపి
రాజకీయం
చేయాలనే
ప్రయత్నం
చేస్తుందని
మంత్రి
జగదీష్
రెడ్డి
విమర్శించారు.