Governor khairatabad ganesh esl narasimhan hyderabad గవర్నర్ ఖైరతాబాద్ గణపతి ఈఎస్ఎల్ నర్సింహన్ హైదరాబాద్ ganesh chaturthi vinayaka chavithi
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలిపూజ
హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో నెలకొల్పిన శ్రీ చండీకుమార అనంత మహాగణపతికి శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్ దంపతులు తొలిపూజ నిర్వహించారు. 57 అడుగుల ఎత్తుతో కొలువుదీరిన మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాజీ మంత్రి దానం నాగేందర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తదితరులు మహాగణపతిని దర్శించుకున్నారు. భారీ ఎత్తున భక్తులు మహా గణపతిని చూసేందుకు తరలివచ్చారు.

కాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ వినాయక చవిత వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధి వీధిలో గణనాయకుడు కొలువుదీరాడు. పలు మండపాల్లో ప్రత్యేక గణనాథులు దర్శనమిస్తున్నారు.