వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ కంటతడి: భావోద్వేగానికి లోనై!.. సినారెతో ఇదీ అనుబంధం..

సినారె తనను ఇంటి పేరుతో సహా పిలిచేవారంటూ గుర్తు చేసుకున్నారు. ఇదే క్రమంలో ఒకింత భావోద్వేగానికి లోనైన నరసింహన్ కంటతడి పెట్టుకున్నారు. ఆయన కంటతడి పెట్టుకోవడం పక్కున్నవారిని కూడా చలించేలా చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసి అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న సినారె నిశ్శబ్దంగా ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. అస్వస్థతతో సోమవారం నాడు ఆయన కన్నుమూయగా.. కుటుంబ సభ్యుల కోరిక మేరకు 14న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు సినారె పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. సినారె మరణం తెలుగు జాతికి తీరని లోటు అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సినారెతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. రవీంద్రభారతిలో ఎన్నో కార్యక్రమాల్లో ఇద్దరం పాల్గొన్నామన్నారు.

సినారె తనను ఇంటి పేరుతో సహా పిలిచేవారంటూ గుర్తు చేసుకున్నారు. ఇదే క్రమంలో ఒకింత భావోద్వేగానికి లోనైన నరసింహన్ కంటతడి పెట్టుకున్నారు. ఆయన కంటతడి పెట్టుకోవడం పక్కున్నవారిని కూడా చలించేలా చేసింది.

governor narasimhan emotional at narayanareddy dead body

కాగా, బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో సినారె అంత్యక్రియలు జరగనున్నాయి. తొలుత పుప్పాలగూడలోని డాలర్‌హిల్స్‌లో ఉన్న ఆయన స్వగృహం నుంచి షేక్‌పేట్‌ నాలా, మెహదీపట్నం, ఆబిడ్స్‌ మీదుగా తిలక్‌రోడ్డులోని తెలంగాణ సారస్వతపరిషత్తుకు ఆయన పార్థివ దేహాన్ని చేరుస్తారు.

అనంతరం ప్రజల సందర్శనార్ధం సారస్వత పరిషత్ లో ఆయన భౌతికకాయాన్ని కొద్ది సేపు ఉంచుతారు. అక్కడి నుంచి అంతిమయాత్ర ప్రారంభమై అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, మెహదీపట్నం, టోలీచౌకి, విస్పర్‌వ్యాలీ మీదుగా మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకుంటుంది. ఈ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

English summary
Telugu states governor ESL Narasimhan gets emotional at Singireddy Narayana Reddy's dead body. He teared up by seeing him in that position
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X