వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభం...పూర్తి వివరాలు మీకోసం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హైదరాబాద్‌లో నివసిస్తున్న నగరవాసులకు ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే. అమీర్‌పేట నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. గవర్నర్ నరసింహన్ జెండా ఊపి మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఇక ఎల్బీనగర్ నుంచి మియాపూర్‌కు వెళ్లాలంటే బస్సులో దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఇక బైక్‌పై వెళితే ఒక అరగంట అటో ఇటో సమయం పడుతుంది. కానీ మెట్రోలో వెళితే గంటలోపు ఒక చివర ఉన్న ఎల్బీనగర్ నుంచి మరో చివర ఉన్న మియాపూర్‌కు చేరుకోవచ్చు.

తక్కువ సమయం

తక్కువ సమయం

హైదరాబాద్ మెట్రో రెండో దశగా అమీర్‌పేట నుంచి ఎల్బీ నగర్ వరకు రైలును ప్రారంభించారు గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్. మొత్తం 52 నిమిషాల్లోనే ఎల్బీనగర్ నుంచి మియాపూర్‌కు మెట్రో రైలు ద్వారా చేరుకోవచ్చు. ఈ రూట్‌లో మొత్తం 18 రైళ్లు తిరుగుతాయి. ప్రస్తుతం ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఫ్రీక్వెన్సీని బట్టి రెండు నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు తయారు చేస్తామని అధికారులు తెలిపారు.

 అమీర్‌పేట నుంచి ఎల్బీ నగర్ వరకు స్టేషన్ల ఇవే

అమీర్‌పేట నుంచి ఎల్బీ నగర్ వరకు స్టేషన్ల ఇవే

అమీర్‌పేట నుంచి ఎల్బీ నగర్వరకు మొత్తం 16 కిలోమీటర్ల దూరం ఉంది. 16 కిలోమీటర్ల మధ్య 17 స్టేషన్లు ఉన్నాయి. అవి పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీభవన్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎంజీబీఎస్ జంక్షన్, మలక్ పేట, న్యూ మలక్ పేట, మూసారంబాగ్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్ స్టేషన్లు ఉన్నాయి.

ఛార్టీలు

ఇక ఛార్జీల విషయానికొస్తే ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లాలంటే ఏసీ బస్సులో రూ.78 ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. అందే మెట్రోలో అయితే రూ.60 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పైగా ట్రాఫిక్ లేకుండా ఎంచక్కా త్వరగా గమ్యస్థానికి చేరుకోవచ్చు. మధ్యలో నాంపల్లి రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, ఉండటంతో దూరప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్ బస్టాండ్‌లకు చేరుకునే ప్రయాణికులతో మెట్రోకు మరింత ప్రజాదరణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఎంజీబీఎస్ దగ్గర ఉంటే ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్ ఛేంజ్ స్టేషన్.

కారిడార్

కారిడార్

అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్్‌కు మెట్రో రైలు ప్రారంభం కావడంతో కారిడార్ -1లోని 29 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ మెట్రో రైలు కూడా అందుబాటులోకి వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. డిసెంబర్‌లోగా అమీర్‌పేట్ హైటెక్ సిటీ మెట్రోపనులు పూర్తయి సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ తెలిపారు.

English summary
Hyderabad Metro Rail will begin its services on the 16-km stretch between Ameerpet to LB Nagar today. With this, the entire 29 km of Corridor-I from Miyapur to LB Nagar will become operational. Prime Minister Narendra Modi had inaugurated the 30 km Miyapur-Nagole stretch out of the 72 km long elevated Hyderabad Metro Rail project in November last year. It is recording footfall of around 85,000 passengers per day. The Governor of Andhra Pradesh and Telangana ESL Narasimhan flagged off the Hyderabad metro train at Ameerpet station at 12 noon today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X