వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భేటీ: ఘంటా చక్రపాణి టీమ్‌కు గవర్నర్ ప్రశంసల జల్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఘంటా చక్రపాణి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్సీ)పై రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్‌లో కూడా కమిషన్ ఇదేవిధంగా అత్యున్నత పనితీరును కొనసాగిస్తూ తెలంగాణలోని నిరుద్యోగుల ఆకాంక్షలకు తగినట్లు వ్యవహరించాలని గవర్నర్ సూచించారని కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు కమిషన్ సభ్యులు కలిశారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు, కమిషన్ చేపట్టిన వినూత్న విధానాలను వివరించినట్లు కమిషన్ తెలిపింది.

Governor praises TSPSC working style

టీఎస్‌పీఎస్సీ నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ పరీక్ష విధానంపై గవర్నర్ ప్రత్యేక ఆసక్తిని కనబరిచారని, ఆన్‌లైన్ పరీక్షా విధానం, ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ఉద్యోగార్థుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తున్నట్లు సమావేశంలో గవర్నర్‌కు టీఎస్‌పీఎస్సీ సభ్యులు తెలిపారు.

ఇప్పటివరకు నిర్వహించిన ఏడు ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో ఐదింటిని ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించినట్లు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారని కమిషన్ తెలిపింది. కమిషన్ ఏర్పాటైన స్వల్పకాలంలోనే వినూత్నమైన విధానాలు, పారదర్శకంగా పరీక్షల నిర్వహణతో దేశంలోని మిగతా కమిషన్‌లకు ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ ప్రశంసించారు అని భేటీ వివరాలను టీఎస్‌పీఎస్సీ.

English summary
Governor ESL Narasimhan praised Telangana State public service commission (TSPSC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X