
గవర్నర్ తమిళి సై ఢిల్లీ టూర్.. అమిత్ షాతో భేటీ.. ఆ నివేదికపై ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య గ్యాప్ రోజురోజుకు పెరుగుతుండడం, గవర్నర్ కు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు రావడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ వెళ్లినట్లుగా సమాచారం.

అమిత్ షాతో గవర్నర్ తమిళి సై భేటీ
ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో తమిళిసై భేటీ కానున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పాగా వేసి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా టిఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని కెసిఆర్ సూచిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో కేంద్రం నుండి గవర్నర్ తమిళిసై కు పిలుపు రావడం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

తెలంగాణా ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య గ్యాప్
ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య దూరం బాగా పెరిగింది. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వివాదం మొదలు కాగా రెండు రోజుల క్రితం రాజ్ భవన్ లో ఉగాది వేడుకల సందర్భంగా గవర్నర్ కు, కేసీఆర్ కు మధ్య ఉన్న గ్యాప్ మరోమారు వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాను ఎవరికీ భయపడని, తాను శక్తివంతురాలినని పేర్కొని రాజ్ భవన్ లిమిట్స్ తనకు తెలుసంటూ తననెవరూ నియంత్రించ లేరని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

గవర్నర్ విషయంలో ప్రోటోకాల్ వివాదం.. యాదాద్రిలో గవర్నర్ కు అవమానం
గవర్నర్
తమిళిసై
చేసిన
వ్యాఖ్యలు
కెసిఆర్
ను
ఉద్దేశించి
చేసిన
వ్యాఖ్యలని
పెద్ద
ఎత్తున
చర్చ
జరిగింది.
గవర్నర్
తమిళిసై
విషయంలో
ప్రోటోకాల్
పాటించడం
లేదంటూ
కూడా
తెలంగాణ
రాష్ట్రంలో
రగడ
కొనసాగుతుంది.
ఇటీవల
యాదాద్రి
లక్ష్మీనరసింహస్వామి
దర్శనానికి
వెళితే
కనీసం
ఈవో
కూడా
హాజరు
కాకపోవడం
గవర్నర్
విషయంలో
ప్రోటోకాల్
పాటించడం
లేదు
అన్న
దానికి
అద్దం
పడుతుంది.

హోం మంత్రి అమిత్ షాకు గవర్నర్ నివేదిక ... భవిష్యత్ పరిణామాలపై ఆసక్తి
ఇలా వరుస వివాదాలతో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య పెరిగిన గ్యాప్ నేపథ్యంలో తాజా పరిణామాలు, పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షా కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలపైన కూడా గవర్నర్ తమిళిసై హోంశాఖకు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఏదిఏమైనా తాజాగా గవర్నర్ ఢిల్లీకి వెళ్లడంతో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.