మెడికల్ పీజీ సీట్ల స్కాంపై గవర్నర్ తమిళిసై సీరియస్: రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం, ఇటీవలి ఘటనలపైనా
హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ పీజీ బ్లాక్ దందా వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన స్టేట్ ర్యాంక్ హోల్డర్లకు పీజీ మెడికల్ సీటు నిరాకరించడానికి కారణమైన వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.

విద్యార్థులు నష్టపోవద్దంటూ గవర్నర్ తమిళిసై ఆదేశాలు
తాను
స్వయంగా
డాక్టర్‌ను
అని..
సీట్ల
బ్లాక్
దందాపై
నివేదిక
ఇవ్వాలని
వీసీని
గవర్నర్
ఆదేశించినట్లు
తెలిసింది.
విద్యార్థులు
నష్టపోకుండా
చర్యలు
తీసుకోవాలని
గవర్నర్
అధికారులను
కోరారు.
కాగా,
వరంగల్
కాళోజీ
హెల్త్
యూనివర్సిటీలో
మెడికల్
పీజీ
సీట్ల
కుంభకోణం
వెలుగుచూసింది.
పేద
విద్యార్థులకు
అందాల్సిన
సీట్లను
కొందరు
యూనివర్సిటీ
అధికారులు,
ప్రైవేటు
మెడికల్
కాలేజీ
యాజమాన్యాలు
కోట్ల
రూపాయలకు
అమ్మేస్తున్నాయి.

కాళోజీ యూనివర్సిటీలో మెడికల్ సీట్ల స్కాం
ప్రతిభగల విద్యార్థులకు దక్కాల్సిన సీట్లు కోట్లు కుమ్మరించగల వారికి వెళ్లిపోతున్నాయి. మెడికల్ సీట్ల స్కాం పక్కా ప్లాన్‌తో జరుగుతున్నట్లు దాని మోడస్ ఆపరెండీ బట్టి తెలుస్తోంది. ముందు సీట్లను బ్లాక్ చేసి తర్వాత వాటిని అమ్మేసేందుకు కొందరు ప్లాన్ వేశారని అనుమానిస్తున్నారు. ఇలాంటి 40కిపైగా అనుమానాస్పద దరఖాస్తులను గుర్తించారు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్. కాగా, మెడికల్ స్కాం విషయాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు రిజిస్ట్రార్. మంత్రి ఆదేశాలతో వరంగల్ పోలీసు కమిషనర్‌కు పిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి అసలు దొంగలను పట్టుకుంటామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల నేరాలపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై
మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివేదిక కోరారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులపై ఆమె ఆరా తీస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య ఘటనపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో రామాయంపేటలో తల్లీకుమారుడి ఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివేదిక అడిగారు. భువనగిరి పరువు హత్య, సూర్యాపేట జిల్లాలో సామూహిక అత్యాచార ఘటనపై కూడా పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మీడియాలో వచ్చిన వార్తలు, బీజేపీ రాష్ట్ర శాఖ వినతి ఆధారంగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.