మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపోహలు,అనుమానాలు.... కరోనా 'భయం'తో ప్రభుత్వ ఉద్యోగి బలి...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పట్ల సమాజంలో అశాస్త్రీయ ఆలోచనలు,అపోహలు గూడు కట్టుకున్నాయి. అనవసర భయాందోళనలతో ప్రాణాలు తీసుకుంటున్నవారు కొందరైతే.. కరోనా పేషెంట్ల పట్ల వివక్ష చూపిస్తున్నవారు మరికొందరు. చదువుకున్నవాళ్లు.. సమాజంలో ఒకింత బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్లు సైతం కరోనా విషయంలో గందరగోళానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు కలచివేస్తున్నాయి.

తాజాగా కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో రాజా వెంకటరమణ(54) అనే ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఇటీవల జ్వరం బారిన పడ్డారు.ఈ క్రమంలో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా... కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అనంతరం తన కార్యాలయానికి వెళ్లిన వెంకటరమణ సాయంత్రం వరకూ అక్కడే విధుల్లో ఉన్నారు.

govt employee committed suicide over fear of coronavirus

Recommended Video

Tollywood Juniour Artists Requesting Government to Help During COVID-19 Pandemic Situations

విధులు ముగించుకున్న అనంతరం మంచిర్యాలలోని ఇంటికి వెళ్లకుండా... కరీంనగర్‌లోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న తన ఫ్లాట్‌కి వెళ్లాడు. అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంకటరమణ ఫోన్‌కి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. కరీంనగర్‌లోని బంధువులకు ఫోన్ చేసి... ఫ్లాట్ వద్దకు వెళ్లి చూడాలని కోరారు. దీంతో వారు ఫ్లాట్ వద్దకు వెళ్లగా... లోపల వెంకట రమణ ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Venkata Ramana(54) A government employee was committed suicide due to fear of coronavirus on Thursday,in Karimnagar.Initially, he visited a local doctor in Mancherial,he was suggested to go for coronavirus test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X