వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: రెస్టారెంట్-హోటళ్లలో సంతృప్తి చెందితేనే సర్వీస్ ఛార్జ్ ఇవ్వొచ్చు

హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి సర్వీస్ ఛార్జీ చెల్లించడం తప్పనిసరి కాదు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి సర్వీస్ ఛార్జీ చెల్లించడం తప్పనిసరి కాదు. వినియోగదారులకు ఇష్టం ఉంటే సర్వీస్ ఛార్జీలు చెల్లించవచ్చు. లేదంటే ఊరుకోవచ్చు.

హోటళ్లు, రెస్టారెంటులలో వేసే సర్వీస్ ఛార్జీ చెల్లించాలా వద్దా అనేది పూర్తిగా వినియోగదారుల ఇష్టమని కేంద్రం తేల్చింది. అంటే ఇకపై సర్వీస్ ఛార్జి తప్పనిసరి కాదని తెలిపింది. ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లలో ఐదు శాతం నుంచి ఇరవై శాతం సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్నారు.

ఇకపై ఆయా హోటళ్లు, రెస్టారెంట్‌లలో వంటకాలతో పాటు సర్వీస్ కూడా పూర్తి సంతృప్తికరంగా ఉంటేనే సర్వీస్ చార్జీ చెల్లించవచ్చు. లేదంటే చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర వినియోగదారుల విభాగం ఆదేశాలు జారీ చేసింది.

Govt puts it on the plate: Pay service charge at restaurants only if you're happy

తగిన చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దీని పైన సూచనలు పంపించింది. సర్వీసు చార్జీ విచక్షణతో కూడుకున్నదని తెలిపింది.

దీనిని చూశాక ఎవరైనా గెలుపుపై ఆశలు పెట్టుకోగలరా?: మోడీ ప్రశ్నదీనిని చూశాక ఎవరైనా గెలుపుపై ఆశలు పెట్టుకోగలరా?: మోడీ ప్రశ్న

కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ట్రేడ్ నియమం ప్రకారం విక్రయాలను ప్రమోట్ చేసేందుకు, ఏదైనా గూడ్సును సప్లై చేసేటప్పుడు అందించే సర్వీసులకు న్యాయవిరుద్ధమైన నిబంధనలను, రెస్టారెంట్లు ఇతర సంస్థలు ఎంచుకుంటే, వినియోగదారులు సంబంధిత ఫోరంకు వెళ్లే అవకాశముంటుందని తెలిపింది.

English summary
Pay service charge at restaurants only if you’re happy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X