హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘టీ’ పథకాలు భేష్, 2రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి: వెంకయ్య, ఇంటింటికీ గ్యాస్: పాశ్వాన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అన్న భేదం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మౌలాలి పారిశ్రామిక వాడలో నూతనంగా నిర్మించిన భారతీయ ప్రమాణాల సంస్థ (బిఐఎస్‌) కార్యాలయ భవనాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌తో కలిసి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుండాలన్నది తన అభిమతం అన్నారు. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరైనా ఢిల్లీ వస్తే దగ్గరుండి మరీ సంబంధిత మంత్రులను కల్పిస్తున్నానని చెప్పారు. ఏదో ఒక పథకం ద్వారా రెండు రాష్ట్రాలకు నిధులు వచ్చేలా చూస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు చాలా బాగున్నాయని అన్నారు.

కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికీ గ్యాస్ అందిస్తామని చెప్పారు. వినియోగదారుల చట్టానికి మరింత పదును పెట్టనున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాణ్యత ప్రమాణాల నిర్ధారణకు ప్రయోగశాలల ఏర్పాటు చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అంతకు ముందు వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో నాణ్యత ప్రమాణాల నిర్ధారణకు హైదరాబాద్, ఆంధ్రలో ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు పాశ్వాన్ అంగీకరించారు.

హైదరాబాద్‌లో మౌలాలీలోని ఇదే భవనంలో ప్రయోగశాల ఏర్పాటుకు ఆమోదిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానికి సమీపంలో స్థలం చూపిస్తే ప్రయోగశాల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. నాణ్యతా ప్రమాణాల కోసం 1986 సంవత్సరంలో భారతీయ ప్రమాణాల బ్యూరో (బిఐఎస్)ను ప్రారంభించామని ఆయన చెప్పారు.

బిఐఎస్ ప్రారంభోత్సవం

బిఐఎస్ ప్రారంభోత్సవం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అన్న భేదం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

బిఐఎస్ ప్రారంభోత్సవం

బిఐఎస్ ప్రారంభోత్సవం

మౌలాలి పారిశ్రామిక వాడలో నూతనంగా నిర్మించిన భారతీయ ప్రమాణాల సంస్థ (బిఐఎస్‌) కార్యాలయ భవనాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌తో కలిసి శనివారం ప్రారంభించారు.

బిఐఎస్ ప్రారంభోత్సవం

బిఐఎస్ ప్రారంభోత్సవం

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుండాలన్నది తన అభిమతం అన్నారు.

బిఐఎస్ ప్రారంభోత్సవం

బిఐఎస్ ప్రారంభోత్సవం

అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరైనా ఢిల్లీ వస్తే దగ్గరుండి మరీ సంబంధిత మంత్రులను కల్పిస్తున్నానని చెప్పారు. ఏదో ఒక పథకం ద్వారా రెండు రాష్ట్రాలకు నిధులు వచ్చేలా చూస్తున్నానని పేర్కొన్నారు.

బిఐఎస్ ప్రారంభోత్సవం

బిఐఎస్ ప్రారంభోత్సవం

కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికీ గ్యాస్ అందిస్తామని చెప్పారు.

బిఐఎస్ ప్రారంభోత్సవం

బిఐఎస్ ప్రారంభోత్సవం

వినియోగదారుల చట్టానికి మరింత పదును పెట్టనున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాణ్యత ప్రమాణాల నిర్ధారణకు ప్రయోగశాలల ఏర్పాటు చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

బిఐఎస్ ప్రారంభోత్సవం

బిఐఎస్ ప్రారంభోత్సవం

అంతకు ముందు వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో నాణ్యత ప్రమాణాల నిర్ధారణకు హైదరాబాద్, ఆంధ్రలో ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు పాశ్వాన్ అంగీకరించారు.

జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో వినియోగదారుల కోర్టులను పటిష్ఠవంతం చేస్తామని, ఫోరాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన వివరించారు. వాటర్ బాటిల్ నుంచి మొదలుకుని బంగారం వరకు వినియోగదారులు ఉపయోగించే ప్రతి వస్తువునూ బ్యూరో పరిశీలిస్తుందని అన్నారు. నీటి బాటిల్‌తో సహా ప్రతి వస్తువుపై తయారు చేసిన తేదీ, వాడకానికి చివరి గడువును (ఎక్స్‌పైరీ) తప్పని సరిగా ముద్రించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
The Government is working on strengthening consumer courts in the country by providing different consumer-friendly measures like allowing complaints from anywhere and simplifying the procedures, Union minister Ram Vilas Paswan said here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X